Saturday, January 18, 2025
HomeTrending Newsధరణికి రెండేళ్ళు... 26 లక్షలకు పైగా లావాదేవీలు

ధరణికి రెండేళ్ళు… 26 లక్షలకు పైగా లావాదేవీలు

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభించిన ధరణి పోర్టల్‌ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై బుధవారానికి (నవంబర్ 2వ తేదీ)కి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక సిటిజెన్ ఫ్రెండ్లి ఆన్‌లైన్ పోర్టల్. భూమి సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. 2020 నవంబర్ 2న ప్రారంభించిన ధరణి భూ పరిపాలన లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
ధరణి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో కేవలం 141 ప్రాంతాల్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ధరణి ప్రారంభంతో రాష్ట్రంలోని 574 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్లను ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. రిజిస్ట్రేషన్ల అనంతరం తమ భూములకు సంబంధించి రెవిన్యూ రికార్డుల్లో మ్యుటేషన్లు కూడా జరిగేలా చర్యలు చేపట్టారు. అదేసమయంలో ఈ-పట్టాదార్ పాస్  పుస్తకాలు జనరేట్ కావడంతో పాటు దీనికి సంబందించిన సమాచారం ఎస్.ఎం.ఎస్ ద్వారా సిటిజన్ లకు అందుతుంది. రిజిస్ట్రేషన్ జరిగిన వారం రోజుల్లోగా 18 సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన పట్టాదార్ పాస్ పుస్తకం పంపిణీ అవుతుంది.
నేటి వరకు ధరణి పోర్టల్ కు 9 .16 కోట్ల హిట్స్ వచ్చాయి. 26 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వ్యవసాయ సంబంధిత లావాదేవీలు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నసమస్యలు కూడా ధరణి లో పరిష్కారమవుతున్నాయి. గతంలో 2 .97 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినా మ్యుటేషన్లు జరగలేదు. ధరణి ప్రారంభంతో వీటికి పరిష్కారం లభించింది.
భూ సంబంధిత 3 .16 వివాదాలను ప్రభుత్వం పరిష్కరించింది.ఇప్పటివరకు 11 .24 లక్షల లావాదేవీలను ధరణి ద్వారా పూర్తి చేశారు. 2 .81 లక్షల గిఫ్ట్ డీడ్ లను రిజిస్ట్రేషన్లు చేసింది. లక్షా 80 వేల మందికి సక్సేషన్ రైట్స్ లను ధరణి ద్వారా అందించింది.
భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పడంతోపాటు తమ భూములకు రక్షణ నెలకొనిందని రైతులు సంతోషంతో ఉన్నారు. రాష్ట్రంలో 70 లక్షల పట్టాదారులకు చెందిన కోటి 54 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ రైతులందరూ ఏవిధమైన సమస్యలు లేకుండా రైతు బంధు పధకాన్ని పొందుతున్నారు.
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా సులభంగా బదలాయింపుకు కూడా ఈ ధరణిలో వెసులుబాటు కల్పించారు. దీనితో, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియ ద్వారా పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందించినట్టుగా మారింది. ధరణి దేశంలోని పలు రాష్ట్రాలకు రానున్న కాలంలో మార్గదరిశంగా మారుతుందనడంలో ఏవిధమైన సందేహం లేదని చెప్పవచ్చు.
రెండేళ్లలో ధరణి పురోగతి వివరాలు
*హిట్‌ల సంఖ్య : 9 .16 కోట్లు
*ధరణి ద్వారా 26 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయి.
*11 .24 లక్షల అమ్మకపు ట్రాంజాక్షన్లు పూర్తి
*2 .81 లక్షల గిఫ్ట్ డీడ్ లను జరిపి లక్షా 80 వేల లబ్దిదారులకు వారసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ధరణి ద్వారా అందించాం.
రాష్ట్రంలోని 70 లక్షల పట్టాదారులకు చెందిన కోటి 54 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి ఏవిధమైన సమస్యలు లేకుండా రైతు బంధు పధకం అందుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్