పాకిస్తాన్ లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన చైనా వాటిని కాపాడుకునేందుకు నీతి మాలిన పనులకు ఉపక్రమించింది. బెలోచిస్తాన్, సింద్, ఆక్రమిత కాశ్మీర్ లో ఓడరేవుల నుంచి గనుల వరకు విధ్యుత్ ప్రాజెక్టులు ఇలా అనేక రంగాల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. ఈ మధ్య కాలంలో చైనా వ్యతిరేకత పెరిగి స్థానికులు చైనా పౌరులు కనిపిస్తే దాడులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు కూడా దిగుతున్నారు. ఇటీవల కరాచీలో ఉన్నత విద్యావంతురాలైన బలోచ్ మహిళా ఆత్మాహుతికి పాల్పడి చైనీయులను బలిగొంది. అంతకు ముందు చైనా ఇంజనీర్ల వాహనం మీద దాడి చేసి మారణహోమం సృష్టించారు.
చైనా తమ సంపద దోచుకుపోతోందనే అనుమానం పాక్ ప్రజల్లో బలంగా పెరుగుతోంది. ప్రజల అనుమానాలకు తగినట్టుగానే చైనా కంపెనీలు దోచుకోవటమే కానీ స్థానిక ప్రజల సంక్షేమం పట్టించుకోవటం లేదు. బెలోచిస్తాన్ లో బెలుచ్ తిరుగుబాటు దారులు చైనా పౌరులు కనిపిస్తే దాడులు చేస్తున్నారు. వీరికి తోడు సింద్ రాష్ట్రంలో కూడా చైనా పౌరుల మీద దాడులు పెరిగాయి. చైనా కంపెనీల అంతం చూస్తామని ఇటీవల సింధు దేశ్ పీపుల్స్ ఆర్మీ (SSPA) ప్రకటించింది. Belochistan Libaretion Army(BLA), Sindhu Desh Peoples Army (SSPA)లకు ప్రజల్లో మద్దతు పెరుగుతోంది.
దీంతో వీరిని కట్టడి చేసేందుకు దౌత్య నీతి మరచి గల్ఫ్ దేశాలపై చైనా ఒత్తిడి పెంచుతోంది. బలూచ్, సింద్ తిరుగుబాటుదారులు ఆయా దేశాల్లో ఉంటే వెంటనే వారిని పాకిస్తాన్ కు అప్పగించాలని వెంతపడుతోంది. కరోనా సమయంలో బలోచ్ తిరుగుబాటుదారు రషీద్ హుస్సేన్ ను యుఏఈ నుంచి పాకిస్తాన్ కు అప్పగించే వరకు తీవ్ర స్థాయిలో చైనా ఒత్తిడి చేసింది. కరాచీ నగరంలో చైనా పౌరులను హతమార్చిన సింద్ వేర్పాటువాదులు ఖతర్ లో ఉన్నట్టు వార్తలు రావటంతో వారి కోసం చైనా గాలింపు ముమ్మరం చేసింది. చైనా నిఘా వర్గాలే వారిని పట్టుకుని ఆయా దేశాల ప్రభుత్వాల ద్వారా పాకిస్తాన్ పంపుతోంది. చైనా విధానాలపై అంతర్జాతీయంగా అసంతృప్తి వెల్లువెత్తుతోంది. చైనా తీరు మనవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : జిన్ పింగ్ కు మూడినట్టేనా చైనాలో తిరుగుబాటు ?