Sunday, February 23, 2025
HomeTrending Newsఆఫ్ఘన్ లో భూకంపం.. ఇస్లామాబాద్ లో ప్రకంపనలు

ఆఫ్ఘన్ లో భూకంపం.. ఇస్లామాబాద్ లో ప్రకంపనలు

ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఉత్తరంలోని బదక్షాన్ ప్రావిన్స్ లోని  ఫైజాబాద్‌కు 79 కిలోమీట్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 200 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది.  దీని ధాటికి రాజధాని కాబుల్ తో పాటు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో కూడా భుప్రకంపనలు సంభవించాయి.

కాగా, దీని ప్రభావంతో న్యూఢిల్లీ, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌లో భూమి స్వల్పంగా కంపించిందని అధికారులు వెల్లడించారు. ఐదు రోజుల వ్యవధిలో ఢిల్లీలో భూకంపం రావడం ఇది రెండోసారి. జనవరి 1న ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో 3.9 తీవ్రతతో భూ కంపించింది. కాగా, అఫ్గాన్‌లో భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్