Sunday, January 19, 2025
HomeTrending Newsఈడి వ్యవహారంపై శివసేన, కాంగ్రెస్ ల విమర్శలు

ఈడి వ్యవహారంపై శివసేన, కాంగ్రెస్ ల విమర్శలు

ఈడిని కేంద్రప్రభుత్వం స్వప్రయోజనాలకు, విపక్ష పార్టీలను వేధించేందుకు వాడుకుంటోందని శివసేన ఆరోపించింది. ఈడి వ్యవహారంపై చర్చ కోసం ఈ రోజు రాజ్యసభలో శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది నోటీసు ఇవ్వగా చైర్మన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ప్రియాంక చతుర్వేది కేంద్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. ప్రజల తరపున ప్రతిపక్షాలు గొంతు ఎత్తకుండా కేంద్రప్రభుత్వం ఈడిని ఆయుధంగా వాడుతోందని విమర్శించారు. మరోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సిబిఐ, ఈడి, ఆధాపన్ను శాఖలపై ఒత్తిడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటి పనితనంపై ప్రజలకు అనుమానం కలిగేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా వివిధ శాఖల్ని అస్త్రాలుగా వాడుతోందని గెహ్లోట్ విమర్శించారు.

శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడి అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మనీ లాందేరింగ్ కేసులో మరింత కూపీ లాగేందుకు అదుపులోకి తీసుకుంటున్నామని ఎన్ఫోర్సుమేంట్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సంజయ్.. విచారణకు డుమ్మా కొట్టారు. జులై 27న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున హాజరు కాలేనన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో పాటు ఈడీ అధికారులు ముంబయిలోని రౌత్‌ ఇంటికి చేరుకున్నారు. పత్రా చాల్‌ భూకుంభకోణం కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ అధికారుల సోదాలు జరుగుతున్న సమయంలోనే సంజయ్‌ రౌత్‌ ట్విట్ చేశారు.

రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తాను ఎలాంటి తప్పు చేయలదేన్నారు. ఇలాంటి దాడులు ఎన్ని నిర్వహించినా తాను శివసేనను వీడేది లేదన్నారు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి చెబుతున్నాను. బాలాసాహెబ్‌ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా.. అంటూ పోస్ట్ చేశారు.

Also Read : హేమంత్ సోరెన్ పై ఈడీ దాడులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్