Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Eng Vs.NZ 2nd Test: రూట్, బ్రూక్ సెంచరీలు

Eng Vs.NZ 2nd Test: రూట్, బ్రూక్ సెంచరీలు

న్యూజిలాండ్ తో మొదలైన రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో  భారీ స్కోరు దిశగా సాగుతోంది. జోరూట్(101), హ్యారీ బ్రూక్(184) సెంచరీలతో కదం తొక్కి అజేయంగా నిలిచారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లకు 315 పరుగులు చేసింది.

రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ న్యూ జిలాండ్ లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్  267 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వు మైదానంలో నేడు మొదలైన రెండో టెస్టులో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐదు పరుగుల వద్ద తొలి వికెట్ (జాక్ క్రాలే-2) కోల్పోయిన ఇంగ్లాండ్ 21 పరుగుల వద్ద మరో రెండు వికెట్లు (బెన్ డకెట్-9; ఓలీ పోప్-10) పోగొట్టుకుంది. ఈ దశలో జో రూట్- హెన్రీ బ్రూక్ లు మూడో వికెట్ కు అజేయమైన 294 పరుగులు జోడించారు.  రూట్ నెమ్మదిగా ఆడి 182 బంతుల్లో 7 ఫోర్లతో 101 రన్స్ చేయగా; బ్రూక్స్ 169 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లతో 184 పరుగులతో సత్తా చాటాడు.

కివీస్ బౌలర్లలో మాట్ హేన్రీకి రెండు, కెప్టెన్ టిమ్ సౌతీకి ఒక వికెట్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్