Sunday, January 19, 2025
HomeTrending Newsమాల్టాలో ఉచిత ప్రజా రవాణ

మాల్టాలో ఉచిత ప్రజా రవాణ

కాలుష్య నివారణ కోసం యురోపియన్ దేశం మాల్టా వినూత్న నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి తమ దేశంలో ప్రజా రవాణ ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాల్టా దేశంలో జనాభాకు మించిన వాహనాలు ఉండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రైవేటు వాహనాల రద్దీ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాల్టా ప్రభుత్వం పేర్కొంది. ఇందు కోసం దేశ ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేయబోతున్నారు. పర్యాటకులకు మాత్రం చార్జీలు వాసులు చేస్తారు.

ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఉచిత ప్రజా రవాణ విజయవంతం అవుతే మాల్టా దేశానికి వచ్చే పర్యాటకులకు కూడా ఈ సౌకర్యం అందించనున్నారు. యూరోపులో ఇటలీ పక్కన ఉండే మాల్టా దేశం తీసుకున్న ఈ నిర్ణయానికి పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్టా ప్రభుత్వ ఉచిత రవాణ నిర్ణయం టూరిస్టులను కూడా ఆకర్షిస్తుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. మాల్టా స్పూర్తిగా ప్రపంచ దేశాలు కాలుష్య నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మధ్యదార సముద్రంలో ఉండే మాల్టా దేశ జనాభా ఐదు లక్షలు ఉండగా వాహనాలు నాలుగున్నర లక్షలు ఉన్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచినా రద్దీ తగ్గటం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న మాల్టా పాలకులు ఇప్పటి వరకు తొమ్మిది వేల యూరోలు సబ్సిడీగా ఇస్తుండగా తాజాగా 15 వేలకు పెంచారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ఐదేళ్ళ వరకు వివిధ రకాల వాహన పన్నుల నుంచి మినహాయించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్