Sunday, January 19, 2025
Homeసినిమా ‘హిట్ 2’ చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను - అడివి శేష్

 ‘హిట్ 2’ చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను – అడివి శేష్

‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి ‘మేజర్’ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ 2 చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ అవుతుంది. ఈరోజు ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.

ఈ సందర్బంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ… ‘చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. నా జర్నీ గురించి ఆలోచిస్తున్నాను. హీరోలందరికీ నచ్చే హీరో నేను. క్షణం సినిమాకు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు బన్నీ ఇంత పెద్ద లెటర్ రాసి బ్యూటీఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మహేష్ సార్ నా క్షణం టీజర్ రిలీజ్ చేయటమే కాదు.. నాతో మేజర్ సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లారు. చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫేవరేట్ హీరో నాని. గూఢచారి, ఎవరు సినిమాల ట్రైలర్స్‌ని తనే లాంఛ్ చేశారు. ఓ రోజు సడెన్‌గా వచ్చి ట్రైలర్స్ లాంచ్ చేయటం కాదు.. ఓ హిట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తామని అన్నారు.

హిట్ 2 సినిమా అలా లైన్‌కి వచ్చింది. మంచి సినిమా చేయాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. కోవిడ్ సమయంలో హిట్ 2 సినిమా చేయటానికి టీమ్ ఎంతో కష్టపడింది. సినిమా చాలా బావుంటుంది. ఎంజాయ్ చేస్తారు. టీజర్ చూడగానే విలన్ వాయిస్ బాగా నచ్చింది. హిట్ వెర్సెలో డిఫరెంట్ విజన్స్ ఉన్నాయి. అందుకనే హిట్ 2లో నేను యాక్ట్ చేశాను. హిట్ 1 క్వశ్చన్స్‌తో థ్రిల్ చేస్తే.. హిట్ 2 భయపెట్టి థ్రిల్ చేస్తుంది. శైలేష్ నన్ను కొత్తగా చూపించాడు. మంచి నటీనటులతో పని చేశాను. గ్యారీ ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేశారు. తను త్వరలోనే నిఖిల్ స్పైతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. మణికందన్.. ఫెంటాస్టిక్ టెక్నీషియన్. మీనాక్షి చౌదరి టాలెంటెడ్ ఆర్టిస్ట్. నేచురల్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. హిట్ 2 డిసెంబర్ 2న రానుంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్