Saturday, January 18, 2025
HomeTrending Newsధరణి వెబ్‌సైట్‌లో భారీ మార్పులు !

ధరణి వెబ్‌సైట్‌లో భారీ మార్పులు !

Huge Changes On Dharani Website :

తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌లో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్‌తో సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మిస్తే రైతు బంధు కట్ చేయాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

మరోవైపు ధరణి పోర్టల్ వచ్చాక లక్షల ఎకరాల్లో భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దీంతో కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ మేరకు రైతుల వినతులను సుమోటోగా తీసుకుని వెంటనే భూ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 7 రోజుల్లో నిషేధిత జాబితా నుంచి భూములను అధికారులు తొలగించనున్నారు.

ధరణి వెబ్‌సైట్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఏడాది గడిచినా పలుమార్లు రిజిస్ట్రేషన్ స్లాట్లు రద్దయిన సందర్భాల్లో ఛలానాల రూపంలో చెల్లించిన నగదు వెనక్కి రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నా డబ్బులు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Also Read : రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్