India in race: ఆసియా కప్ హాకీ టోర్నీ సూపర్-4లో ఇండియా- మలేషియా జట్ల మధ్య నేడు జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. అయితే నాలుగు పాయింట్లతో సూపర్ 4 లో రెండోస్థానంలో నిలిచింది.
నేటి మ్యాచ్ లో 12, 21వ నిమిషాల్లో మలేషియా ఆటగాడు రహీం రజీ పెనాల్టీ కార్నర్ ద్వారా రెండు గోల్స్ సంపాదించాడు. అయితే 32, 55, 56 నిమిషాల్లో ఇండియా ఆటగాళ్ళు విష్ణు కాంత్ సింగ్ (పెనాల్టీ కార్నర్), విఠలాచార్య సునీల్( ఫీల్డ్ గోల్డ్); నీలమ్ సంజీప్ (పెనాల్టీ కార్నర్) గోల్స్ సాధించడంతో ఇండియా ఆధిక్యం 3-2 కు చేరుకుంది. కానీ 56 వ నిమిషంలో రహీం రాజీ పెనాల్టీ కార్నర్ ద్వారా మరో గోల్ సాధించి స్కోరును సమం చేశాడు.
సూపర్ -4 మ్యాచ్ ల్లో భాగంగా ఎల్లుండి మే, 31న ఇండియా జట్టు సౌత్ కొరియాతో తలపడనుంది.
ఫైనల్స్ జూన్ 1న జరగనుంది.
Also Read : ఆసియా కప్ హాకీ: జపాన్ పై ఇండియా గెలుపు