Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్టి20 వరల్డ్ కప్:  అక్టోబర్ 13న ఇండియా-పాక్ మ్యాచ్

టి20 వరల్డ్ కప్:  అక్టోబర్ 13న ఇండియా-పాక్ మ్యాచ్

ICC T20 Schedule: ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరగబోయే టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసిసి విడుదల చేసింది. అక్టోబర్ 16న మొదలు కానున్న ఈ మెగా టోర్నీ నవంబర్ 13న జరిగే ఫైనల్ మ్యాచ్ తో  ముగుస్తుంది. అక్టోబర్ 23న మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో కీలకమైన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.

గ్రూప్ – ఏ లో … శ్రీలంక, నమీబియా, మరో రెండు క్వాలిఫైర్ జట్లు
గ్రూప్ – బి లో … వెస్టిండీస్, స్కాట్లాండ్, మరో రెండు క్వాలిఫైర్ జట్లు ఉంటాయి

ఈ రెండు గ్రూపుల్లో ఒక్కోదాని నుంచి మొదటి రెండు స్థానాల్లో  నిలిచిన నాలుగు జట్లు సూపర్ 12 కు చేరుకుంటాయి.

గ్రూప్ -1 లో …. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, విన్నర్స్ అఫ్ ‘ఏ’; రన్నర్స్ అఫ్ ‘బి’
గ్రూప్ -2 లో …. ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, విన్నర్స్ అఫ్ ‘బి’; రన్నర్స్ అఫ్ ‘ఏ’ జట్లు ఉంటాయి.

ఇండియా అక్టోబర్ 23న పాకిస్తాన్; 27న గ్రూప్ ‘ఏ’ రన్నర్ తో; 30న సౌతాఫ్రికా, నవంబర్ 2న బంగ్లాదేశ్, నవంబర్ 6న గ్రూప్ ‘బి’ విన్నర్ తో తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్