Saturday, January 18, 2025
HomeTrending Newsవిశ్వనాథ్, కృష్ణా-సుచిత్రా ఎల్లాలకు వైఎస్సార్ అవార్డులు

విశ్వనాథ్, కృష్ణా-సుచిత్రా ఎల్లాలకు వైఎస్సార్ అవార్డులు

Ysr Life Time Awards : కళాతపస్వి కె. విశ్వనాథ్, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వ్యవస్థాపకుడు డా. నాగేశ్వర్ రెడ్డి, భారత్ బయోటెక్ అధినేతలు సుచిత్రా, కృష్ణా ఎల్లాలకు ఈఏడాది వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రకటించారు. గత ఏడాది నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు వ్యక్తులు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున… వైయస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అవార్డులను  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ ఎడ్వైజర్ జి.వి.డి.కృష్ణమోహన్‌ నేడు వెల్లడించారు.

ఈ ఏడాది  మొత్తంగా 30 అవార్డులు ప్రకటిస్తున్నామని,  2022 నవంబరు 1న, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానం ఉంటుందని కృష్ణ మోహన్ తెలిపారు.  కమిటీ సిఫార్సులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆమోదం తరువాత ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.

ఇందులో 20… జీవిత సాఫల్య పురస్కారాలు(లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు)
10… సాఫల్య పురస్కారాలు(ఎచీవ్‌మెంట్‌ అవార్డులు).

వ్యవసాయం

1) ఆదివాసీ కేష్యూనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ- సోడెం ముక్కయ్య – బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా
2) కుశలవ కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ- ఎ.గోపాలకృష్ణ; బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా
3) అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌- జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా
4) అమృత ఫల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ, కె.ఎల్‌.ఎన్‌. మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా
5) కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా
వీరందరికీ వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు

కళలు–సంస్కృతి విభాగంలో..

1) కళాతపస్వి, నిండు తెలుగుదనం ఉట్టిపడే తెలుగువాడు… కె.విశ్వనాథ్‌గారికి…
2) బడుగు బలహీన వర్గాల కోసం,నిరంతరం తపించి జీవితాన్ని అర్పించిన ఆర్‌. నారాయణమూర్తి గారికి. వైయస్సార్‌ జీవిత కాల పురస్కారాలను ప్రకటిస్తున్నాం.
3) సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ
4)డన నేతన్న పిచుక శ్రీనివాస్‌కు;
5) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్‌ కట్లరీ…  తయారీలో శ్రీమతి షేక్‌ గౌసియా బేగం … వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రకటిస్తున్నాం.

సాహిత్య సేవలో…
1) విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌;
2) ఎమెస్కో ప్రచురణాలయానికి…
3) రచయిత డాక్టర్‌ శాంతి నారాయణ గారికి… వారి సేవలకు జీవిత కాల సాఫల్య పురస్కారాలను ప్రకటిస్తున్నాం.

మహిళా సాధికారత–రక్షణ విభాగంలో…
1) ప్రజ్వలా ఫౌండేషన్‌– సునీతా కృష్ణన్‌…
2) ఉయ్యూరుకు చెందిన శిరీషా రిహేబిలిటేషన్‌ సెంటర్‌ వారికి… వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటిస్తున్నాం.
3) ఇక మూడో అవార్డును దిశ–పోలీసింగ్‌కు ప్రకటిస్తున్నాం.  రవాడ జయంతి; ఎస్‌వీవీ లక్ష్మీనారాయణ; రాయుడు సుబ్రహ్మణ్యం, హజ్రతయ్య; పి.శ్రీనివాసులు… వీరికి సంయుక్తంగా వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపిక చేయటం జరుగుతోంది.

విద్యా రంగం నుంచి…

1) మదనపల్లి – రిషీ వేలీ విద్యా సంస్థకు
2) కావలి– జవహర్‌ భారతి విద్యా సంస్థకు
వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటిస్తున్నాం.
3) వ్యక్తిత్వ వికాసం… ఆలోచన విధానం… మనస్తత్వ శాస్త్రాల నిపుణుడు శ్రీ బి.వి.పట్టాభిరాం… లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటిస్తున్నాం.
4) బ్యాంకింగ్‌ రంగంలో వేల మంది ప్రవేశానికి దారి చూపిన దార్శనికుడు, మంచి మాస్టారు… నంద్యాలకు చెందిన దస్తగిరి రెడ్డికి… వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటిస్తున్నాం.

మీడియా అవార్డులు
సీనియర్‌ పాత్రికేయులు
1) భండారు శ్రీనివాసరావు
2) సతీశ్‌ చందర్‌
3) మంగు రాజగోపాల్‌
4) ఎంఈవీ ప్రసాదరెడ్డి ఈ నలుగురికీ వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటిస్తున్నాం.

వైద్య రంగంలో విప్లవాలకు అంటుకట్టిన…
1) డాక్టర్‌ బి. నాగేశ్వరరెడ్డి, ఏఐజీకి… ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వారికి;
2) డాక్టర్‌ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్‌ వారికి… (హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌)
3) భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు… (కోవాక్సిన్‌)
4) అపోలో హాస్పటల్స్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ శ్రీ ప్రతాప్‌ సి రెడ్డిగారికి…
5) ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ తరఫున శ్రీ గుళ్ళపల్లి నాగేశ్వరరావుగారికి… ఈ అయిదు సంస్థలు/వ్యక్తులకు వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటిస్తున్నాం.

పారిశ్రామిక రంగంలో
అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శ్రీ గ్రంధి మల్లికార్జునరావుగారికి…
1) వైయస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటిస్తున్నాం.

ఇందులో రంగాల వారీగా చూస్తే… వ్యవసాయానికి 5; సంస్కృతి–సంప్రదాయాలకు 5; మహిళా సాధికారత, రక్షణకు 3; తెలుగు భాషకు 3; విద్యా రంగానికి 4; మీడియా నుంచి 4; వైద్య రంగానికి 5; పరిశ్రమకు 1 అవార్డుల్ని ఇచ్చామని కృష్ణమోహన్ వివరించారు. మీడియా సమావేశంలో సమాచార శాఖ కమిషనర్ శ్రీ టి. విజయకుమార్ రెడ్డి, అవార్డుల కమిటీ మెంబర్- కన్వీనర్ శ్రీ బాలసుబ్రమణ్యం రెడ్డి పాల్గొన్నారు.

Also Read : స్వచ్ఛ సర్వేక్షన్ లో ఏపీకి 11 అవార్డులు  

RELATED ARTICLES

Most Popular

న్యూస్