దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహారి, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఖలిస్థాన్ ఏర్పాటుకు అనుకూలంగా గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. సిక్కులకు న్యాయం చేయాలి, ఖలిస్థానీ జిందాబాద్, రెఫరెండం 2020 అనే నినాదాలను ఆ పోస్టర్లపై రాశారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు, ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
గణతంత్ర దినోత్రదినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశ రాజధానిలో వేర్పాటువాద పోస్టర్లు, జెండాలు కన్పించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ కోసం కంటెంజెంట్లు రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఈ నెల 23న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6.30 నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కర్తవ్యపథ్‌ను మూసివేయనున్నారు.