తన ఫోన్ ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. సాక్ష్యాలు బైట పెడితే ఇద్దరి ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు ఊడిపోతాయని, ప్రభుత్వం షేక్ అయ్యే అవకాశం కూడా ఉందని, అందుకే తాను వాటిని బహిర్గతం చేయలేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణకు కూడా ఆదేశిస్తుందని, నానా యాగీ అవుతుందన్నారు. ఈ విషయమై తన సహచరుడితో శ్రీధర్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. రెండు సార్లు తనకు టికెట్ ఇచ్చారన్న గౌరవం సిఎం జగన్ పై ఉందని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
తన వద్ద ఉన్న సాక్ష్యాన్ని మీకు చూపిస్తానని, ఆ తర్వాత తన నిర్ణయంతో మీరే ఏకీభావిస్తారంటూ శ్రీదర్ రెడ్డి అనుచరుడితో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.