Tuesday, January 21, 2025
HomeTrending Newsమరో ఘనత సాధించిన మంత్రి కేటీఆర్

మరో ఘనత సాధించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు సాధించి, సత్తా చాటారు. వరల్డ్ టాప్ 30 జాబితాలో మంత్రి కేటీఆర్‌కు స్థానం దక్కింది. యావత్ భారతదేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే ఈ టాప్ లిస్టులో చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు కేటీఆర్ కాగా మరొకరు ఎంపీ రాఘవ్ ఛడ్డా. ఈ ఇద్దరిలోనూ మంత్రి కేటీఆరే ముందంజలో ఉన్నారు. ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి అహరహం శ్రమిస్తున్నారు. అటు అఫిషియల్, ఇటు పర్సనల్ అకౌంట్… ఇలా రెండింటిలోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్‌కు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్‌కు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలంతా అభినందనలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్