Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎంను కలుసుకున్న చిన్నారి హనీ

సిఎంను కలుసుకున్న చిన్నారి హనీ

డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ ఆమె తల్లిదండ్రులు తాదేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.

హనీ అరుదైన గాకర్స్‌ వ్యాధితో బాధపడుతోంది. ఆర్ధిక ఇబ్బందులతో తమ బిడ్డకు చికిత్స అందించలేని స్థితిలో ఉన్న చిన్నారి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు  గతంలో  కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎంను కలుసుకొని తమ గొడు వెళ్లబోసుకున్నారు.  హనీ చికిత్స కోసం ఒక  కోటి రూపాయలు మంజూరు చేసిన సిఎం… చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ.10 వేల పెన్షన్‌ కూడా అందించేలా గతంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ప్రస్తుతం చికిత్స అందుకుంటూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్న చిన్నారి హనీ పుట్టిన రోజు సందర్భంగా  చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు సిఎం జగన్ ను కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి హనీని సిఎం  ఆశీర్వదించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్