Sunday, January 19, 2025
HomeTrending Newsకుప్పంలో మూడ్రోజులపాటు యువ గళం యాత్ర

కుప్పంలో మూడ్రోజులపాటు యువ గళం యాత్ర

ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల చొప్పున 100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర ఉండేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు.

ఈ నెల 27న మధ్యాహ్నం 12 గంటలకు తన తండ్రి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుంచి  పాదయాత్ర మొదలు కానుంది. వరదరాజస్వామి గుడిలో పూజలు చేసిన అనంతరం యాత్రకు శ్రీకారం చుడతారు. మూడ్రోజులపాటు కుప్పం నియోజకవర్గంలోని పలు గ్రామాల గుండా యాత్ర సాగనుంది. మొత్తం 29   కిలోమీటర్ల పాటు కుప్పంలో యాత్ర సాగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్