Sunday, January 19, 2025
Homeసినిమావీరయ్య, వీరసింహారెడ్డి ట్రైలర్స్ పై మంచు మనోజ్ కామెంట్స్

వీరయ్య, వీరసింహారెడ్డి ట్రైలర్స్ పై మంచు మనోజ్ కామెంట్స్

‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు ఒక రోజు గ్యాప్ లో వస్తుండడంతో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయా..? లేక ఒక సినిమానే బ్లాక్ బస్టర్ అవుతుందా.? అని అభిమానులే కాకుండా సినీ జనాలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండు సినిమాల ట్రైలర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియన్స్ కి ఈ రెండు సినిమాలు పూనకాలు తెప్పించడం ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. జనవరి 12న వీరసింహారెడ్డి వస్తుంటే.. జనవరి 13న వాల్తేరు వీరయ్య వస్తుంది.

ఈ రెండు సంక్రాంతి సినిమాల గురించి మంచు వారబ్బాయి మంచు మనోజ్ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. ఇంతకీ ఏమని కామెంట్ చేశారంటే… వీర సింహా రెడ్డి ట్రైలర్ నచ్చింది అని, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ ఎనర్జీ అన్ మ్యాచబుల్.. ఈ  సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కి బెస్ట్ విషెస్ అని అన్నారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్య ట్రైలర్ ను చూసి కామెంట్స్ చేశారు.

పూనకాలు వైబ్స్ ఆల్ ఓవర్ అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ లను ఒకే స్క్రీన్ పై చూడటం అద్బుతం. డైరెక్టర్ బాబీకి, చిత్ర యూనిట్ కి గుడ్ లక్ తెలిపారు మంచు మనోజ్. సోషల్ మీడియాలో మనోజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అభిమానులే కాదు సినీ జనాలు కూడా ఈ రెండు సినిమాల కోసం ఓ అభిమాని ఎదురు చూసినట్టుగా ఎదురు చూస్తున్నారు. రెండు సినిమాలు విజయం సాధించడం ఖాయం. అయితే.. ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్