Saturday, November 23, 2024
HomeTrending Newsకాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్య‌క్షుడు చెరుకు సుధాక‌ర్ శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టు చెరుకు సుధాకర్ ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి – చెరుకు సుధాకర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. చెరుకు సుధాకర్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చెరుకు సుధాకర్ చేరిక తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తి అన్నారు. బిజెపి, టీఆరెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. కాంట్రాక్టులు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందంటూ విమర్శలు గుప్పించారు. భద్రాచలం ముంపుకు కారణం ప్రధాని మోడీ, ఆయన మంత్రివర్గం అంటూ విమర్శించారు. తెలంగాణకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఎన్నో ప్రాజెక్టులను బీజేపీ ప్రభుత్వం తిరస్కరించిందని విమర్శించారు. తెలంగాణకు బీజేపీ ద్రోహం చేసిందన్నారు. కాంట్రాక్టులు, కమీషన్ల పేరుతో ప్రలోభాలు పెడుతున్నారు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసంతృప్తిపైనా, ఇటు రాజగోపాల్‌రెడ్డి ఆరోపణలపైనా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రియాక్ట్‌ అయ్యారు. తానెక్కడా వెంకట్‌రెడ్డి గురించి మాట్లాడలేదన్నారు. కేవలం రాజగోపాల్‌రెడ్డి గురించే మాట్లాడాననన్నారు రేవంత్‌. మధ్యాహ్నం మునుగోడులో జరిగే సభకు వెంకట్‌రెడ్డి రావాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఏర్పాడిన తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశాను. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను బలపరిచామని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇంటి పార్టీని, కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కారుల కోసం త్వరలో పీసీసీ కమిటీ ఏర్పాటు చేస్తుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్