Saturday, April 20, 2024
HomeTrending Newsచైనా దూకుడు.. తైవాన్ వార్నింగ్

చైనా దూకుడు.. తైవాన్ వార్నింగ్

తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ఈ రోజు చైనాకు గట్టి సందేశం పంపారు. ‘‘చైనా తైవాన్ చుట్టుపక్కల సైనిక విన్యాసాలు చేపట్టింది. నిగ్రహం పాటించాలని బీజింగ్ ను కోరుతున్నాం. తైవాన్ ఘర్షణను పెంచదు. కానీ, మా సార్వభౌమత్వం, భద్రత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం’’ అని ఇంగ్ వెన్ ప్రకటించారు. చైనా రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. తైవాన్ జలసంధిలో యుద్దనౌకల మోహరింపు, విన్యాసాలు ఈ ప్రాంత శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే విధంగా ఉందని తైవాన్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో ఒక రోజు పర్యటించి, వెళ్లడం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తున్న చైనా తైవాన్ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ చైనాకు హెచ్చరిక చేశారు. తాము వివాదాన్ని పెంచబోమని స్పష్టం చేస్తూ.. అదే సమయంలో తైవాన్ తన సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుందని ప్రకటించారు.

తైవాన్ తన భూభాగంలోనిది అని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. తమది స్వతంత్య్ర దేశమని తైవాన్ గుర్తు చేస్తోంది. దీంతో తైవాన్ కు అమెరికా సహా పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇది చైనాకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ప్రాదేశిక భూభాగం తైవాన్ విషయంలో వేలు పెట్టొద్దంటూ అమెరికా సహా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ, చైనా ఇప్పటికే సంకేతం పంపించింది. మరోవైపు జపాన్ పర్యటనలో ఉన్న యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ చైనా యుద్ధ విన్యాసాలు, యుద్ధ నౌకల మోహరింపుపై ఘాటుగా స్పందించారు. తైవాన్ ప్రజల సార్వభౌమాదికారం కాపాడేందుకు అమెరికా ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ రోజు నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు.

Also Read : తైవాన్ వ్యవహారంలో చైనా అమెరికా మాటల యుద్ధం  

RELATED ARTICLES

Most Popular

న్యూస్