కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసంతృప్తిపైనా, ఇటు రాజగోపాల్‌రెడ్డి ఆరోపణలపైనా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తానెక్కడా వెంకట్‌రెడ్డి గురించి మాట్లాడలేదన్నారు. కేవలం రాజగోపాల్‌రెడ్డి గురించే మాట్లాడాననన్నారు రేవంత్. మధ్యాహ్నం మునుగోడులో జరిగే సభకు వెంకట్‌రెడ్డి రావాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఏర్పాడిన తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశాను. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను బలపరిచామని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇంటి పార్టీని, కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కారుల కోసం త్వరలో పీసీసీ కమిటీ ఏర్పాటు చేస్తుందన్నారు.