Saturday, June 13, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: Table Tennis (Para) ఫైనల్లో  భవీనా

CWG-2022: Table Tennis (Para) ఫైనల్లో  భవీనా

కామన్ వెల్త్ గేమ్స్ లో టేబుల్ టెన్నిస్ పారా సింగిల్స్ లో భారత స్టార్ భవీనా పటేల్  ఫైనల్స్ కు చేరుకొని దేశానికి మరో పతకం ఖాయం చేసింది. నేడు జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ దేశానికి చెందిన బైలీ పై 11-6; 11-6; 11-6 తో మూడు వరుస సెట్లలో (3-0) విజయం సాధించి  గోల్డ్ మెడల్ రేసులో నిలిచింది.

మరో సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సోనాల్ బెన్ పటేల్ 1-3తేడాతో నైజీరియాకు చెందిన ఇక్ పియోయీ చేతిలో ఓటమి పాలైంది.

రేపు గోల్డ్, సిల్వర్ మెడల్స్ కోసం భవీనా – ఇక్ పియోయీ మధ్య;  బ్రాంజ్ మెడల్ కోసం బైలీ-సోనాల్ బెన్ మధ్య పోరు జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular