Sunday, November 24, 2024
Homeసినిమా'మైఖేల్' ఎమోషనల్ డ్రామా చాలా కొత్తగా వుంటుంది - సందీప్ కిషన్

‘మైఖేల్’ ఎమోషనల్ డ్రామా చాలా కొత్తగా వుంటుంది – సందీప్ కిషన్

హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మైఖేల్‘. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైఖేల్ ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ చెప్పిన మైఖేల్ విశేషాలు ఆయన మాటల్లోనే.. మైఖేల్ కథకి, విజువల్ నెరేటివ్ కి, సినిమాకి పాన్ ఇండియా కెపాసిటీ వుంది. విజువల్ గా చాలా ఎక్సయిటింగ్ గా వుంది. యాక్షన్ చాలా ఫ్రెష్ గా వుంటుంది. యాక్షన్ చాలా రియలిస్టిక్ వైబ్ తో వుంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మైఖేల్ చాలా వైల్డ్. గ్యాంగ్ స్టర్ కాకపోయినా మైఖేల్ అనెన్ పాత్ర చాలా ఎగ్రెసివ్. ఇందులో జరిగిన చాలా సంఘటనలు నాకైతే జరగలేదు. నిజంగా ఇలా జరిగితే ఎలా వుంటుందని ఊహించి చేశాను. మైఖేల్ కి ఫ్రెండ్స్ వుండరు. ఎవరితో మాట్లాడడు. తను చేసే పనులన్నీ చాలా ఎక్సయిటింగా వుంటాయి. ఇలాంటి పాత్రలు ఎప్పుడూ చేయలేదు.

మైఖేల్ చాలా యూనిక్ స్టొరీ. చాలా కొత్త నెరేటివ్ స్టయిల్ వుంటుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ చాలా బలంగా వుంటాయి. ఈ సినిమాలో అందరూ బ్యాడ్ గాయ్స్. బ్యాడ్ పీపుల్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ఇందులో డార్క్ కామెడీ ఉంటుంది. మైఖేల్ ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచన నాదే. దానికి సరపడే డైరెక్టర్ ని ఎంచుకోవడంతో సగం పని పూర్తయింది. భరత్ చౌదరి, మోహన్ రావు గారి లాంటి నిర్మాతలు తోడవ్వడంతో ఇక మా దృష్టి అంతా ప్రోడక్ట్ ని సరిగా డెలివర్ చేయడం పైనే పెట్టాం. మైఖేల్ సినిమా చేయడమే మా సక్సెస్. ఇప్పుడు వరకూ నేను చెయ్యాలనుకోని చేయలేనిది ఏమిటని ఆలోచించినపుడు మైఖేల్ ఐడియా వచ్చింది. రంజిత్ తీసిన ఒక సినిమా చూశాను. నా ఆలోచన ఆయనకి చెప్పిన నెల రోజుల తర్వాత మైఖేల్ కథ చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ తనకు ఏం కావాలో అది ఇస్తూ సపోర్టు చేసుకుంటూ వెళ్తున్నాను.

విజయ్ సేతుపతి గారి పాత్ర సినిమాని ఇరవై నిమిషాలు పాటు మోసుకెళుతుంది. గౌతమ్ మీనన్ పాత్ర చాలా ఫ్రెష్ గా వుంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, విజయ్ సేతుపతి ఎప్పుడూ జంటగా కనిపించలేదు. ఇందులో వారి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా వుంటుంది. అలాగే వరుణ్ సందేశ్ కూడా ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. దివ్యాంశ కౌశిక్ పాత్ర కూడా ట్రిక్కిగా వుంటుంది. వీళ్ళంతా కథ, దర్శకుడి పై నమ్మకంతో చేశారు. ఈ కథలో మైఖేల్ పాత్రని కొట్టి ఐదు రోజులు పాటు తిండి తిప్పలు లేకుండా ఎక్కడో పారేసుంటారు. ఆ సీన్ చేస్తున్నపుడు నిజంగానే వాటర్ తప్పితే ఏమీ తీసుకోలేదు. దాదాపు 18 రోజులు పాటు ఆ డైట్ లో వున్నాను. ఒక దశలో కుడి కాలు పని చేయడం మానేసింది. అప్పుడు ఒక ఫైట్ షూట్ చేశాం. పొరపాటున కాలు రాంగ్ గా లాండ్ కావడంతో ఇంక ప్యాకప్ చెప్పాం. దీంతో పాటు షూటింగ్ కూడా చాలా డార్క్ ఏరియాల్లో చేశాం. గాజు పెంకులు గుచ్చుకునేవే. చాలా రోజుల తర్వాత నాతో చాలా పని చేయించుకున్న సినిమా ఇది. చాలా వర్క్ శాటిస్ఫాక్షన్ వుంది.

గ్యాంగ్ స్టర్ ప్రపంచంలో సెట్ చేసిన ఎమోషనల్ డ్రామా ఇది. కథనం చాలా కొత్తగా వుంటుంది. మనం ఊహించిన దాని కంటే సర్ప్రైజ్ వుంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. డైరెక్టర్, డీవోపీ ఇలా అందరం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మైఖేల్ సెట్స్ లో చాలా గొప్ప వర్క్ శాటిస్ఫాక్షన్ దొరికింది. ఈ జర్నీ ని చాలా ఎంజాయ్ చేశాను. బరువు తగ్గాను, స్కూబా డ్రైవింగ్ నేర్చుకున్నాను, అండర్ వాటర్ లో షూట్ చేశాం ఇవన్నీ ఎక్సయిటెడ్ గా చేశాను. మైఖేల్ చాలా స్పెషల్ జర్నీ. భైరవ కోన, బడ్డీ, కెప్టన్ మిల్లర్ సినిమాలు చేస్తున్నాను. ఈ మూడు భిన్నమైన సినిమాలు. దీనితో పాటు ఫ్యామిలీ మ్యాన్ 3 వుంది. అలాగే త్వరలోనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాబోతుంది అన్నారు.

Also Read : ‘శివ’లా ‘మైఖేల్’ కొత్త ట్రెండ్ సృష్టించాలి: హీరో నాని  

RELATED ARTICLES

Most Popular

న్యూస్