Monday, February 24, 2025
HomeTrending Newsబాధితులకు మంత్రి అంబటి, ఎమ్మెల్యేల పరామర్శ

బాధితులకు మంత్రి అంబటి, ఎమ్మెల్యేల పరామర్శ

శుక్రవారం రాత్రి పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘర్షణల్లో గాయపడి, నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ హస్పటలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను రాష్ట్ర జనవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేశ్ రెడ్డి పరామర్శించారు.  ఆస్పత్రిలో ఉన్న కార్యకర్తలు, నేతలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఇద్దరు తీవ్రగాయాల పాలైనట్లు వైద్యులు తెలిపారు.

బాధితులకు పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు నేతలు భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్