Saturday, January 18, 2025
HomeTrending Newsవిద్యార్ధులు నష్టపోకుండా చర్యలు: బొత్స

విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు: బొత్స

SSC Results: రాష్ట్రంలో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణతా శాతం నమోదైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. జూలై 6 నుంచి 15 వరకూ  సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని బొత్స తెలిపారు. మొత్తం 6,15,908 మంది పరీక్షకు హాజరు కాగా 4,14,281మంది పాస్ అయ్యారు. బాలికల ఉత్తీర్ణతా శాతం 70.70 కాగా, బాలురు 64.02 శాతం ఉత్తీర్ణత సాధించారు.

78.3శాతం ఉత్తీర్ణత తో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో  నిలవగా, 49.7శాతంతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో ఉంది. బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది పాస్ అయ్యారు. రేపటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు కట్టొచ్చని,  ఈరోజు ఫలితాల్లో తప్పినవారు సప్లిమెంటరీ పరీక్షలో పాస్ అయితే వారు వచ్చే విద్యా సంవత్సరం నష్టపోకుండా వెంటనే ఫలితాలు విడుదల చేసి పాస్ సర్టిఫికేట్లు కూడా అందిస్తామని వెల్లడించారు. ఈరోజు ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులకు స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

797 స్కూళ్ళు 100శాతం ఉత్తీర్ణత సాదిచాగా, ఒక్క విద్యార్ధి కూడా పాస్ కాని స్కూళ్ళు 71 ఉండడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్