Sunday, January 19, 2025
HomeTrending Newsమోడీని ఎదిరించే దమ్మున్న నేత కేసిఆర్ - ప్రశాంత్ రెడ్డి

మోడీని ఎదిరించే దమ్మున్న నేత కేసిఆర్ – ప్రశాంత్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోడీని,కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ప్రశ్నించి,వారి అవినీతిని ఎండగట్టే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో ఈ రోజు స్థానిక టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. తమ లాంటి కేసిఆర్ సైనికులను డబ్బులతో కొనలేరని తేల్చి చెప్పారు.

దేశంలో కేసిఆర్ ఒక్కడే మోడీ,అమిత్ షా అవినీతిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టే కేసిఆర్ ను కట్టడి చేయడానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ద్వజమెత్తారు. ప్రజల చేత ఎన్నుకోబడిన మహరాష్ట్ర,గోవా,మధ్యప్రదేశ్,కర్ణాటక ప్రభుత్వాలను అక్రమంగా కూలదోసారని మండిపడ్డారు. తమ కార్పొరేట్ మిత్రులకు 12 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేసి,అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేకుండా రాజకీయ వికృత చర్యలకు పాల్పడుతున్న బీజేపీని దేశ వ్యాప్తంగా ప్రజలు చీత్కరిస్తున్నారని అన్నారు.

మోడీ, అమిత్ షా భారత దేశం వారి జాగీర్ అయినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. వారికి కేసిఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తుంటే దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ కుట్రకు పూనుకున్నారని మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలను కొని ఇక్కడ ఏమో జరుగుతుందని తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టారని అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్నాథ్ షిండే లను తయారు చేసి ప్రభుత్వాలను కూల దోసినట్టు తెలంగాణలో చేస్తామంటే…బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు…ఇది కేసిఆర్ అడ్డా అని స్పష్టం చేశారు. 18వేల కోట్లకు అమ్ముడుపోయి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరన్నారు. మా ఎమ్మెల్యేలకు ఒక్కరికి వెయ్యి కోట్లు ఇచ్చిన అమ్ముడుపోరని వాళ్ళు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు,కేసిఆర్ సైనికులనీ స్పష్టం చేశారు. బీజేపీ ప్రలోభాల కుట్రను బట్టబయలు చేసి యావత్ తెలంగాణ సమాజంతో శబాష్ అనిపించుకున్నారన్నారు. గుజరాత్ బానిస బండి సంజయ్ సిగ్గు లేకుండా సమర్డించుకుంటున్నాడని గుజరాత్ బానిసలా ఉండడం కంటే చావడం మేలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలతో సహా నగ్నంగా దొరికిన ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ దొంగలు బండారం ఆధారాలతో సహా బయట పెడతామని మంత్రి వేముల హెచ్చరించారు.

Also Read : మునుగోడులో మునిగేది ఎవరు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్