Monday, September 23, 2024
Homeసినిమా‘ఉగ్రం’ టీజర్ లాంచ్ చేసిన నాగ చైతన్య

‘ఉగ్రం’ టీజర్ లాంచ్ చేసిన నాగ చైతన్య

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సమ్మర్‌లో ఈ సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్ ఈ రోజు టీజర్‌ను విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా విచ్చేసి టీజర్ ని లాంచ్ చేశారు.

నరేష్ పవర్ ఫుల్ పోలీసుగా ఎంట్రీ ఇవ్వడం , అడవిలో చట్టాన్ని ఉల్లంఘించేవారిని కొట్టడం.. వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో టీజర్ ప్రారంభమైయింది. “వంటి మీద యూనిఫాం ఉందనేగా ఈ పొగరు. ఈ రోజు నీదే.. నాకూ ఓ రోజు వస్తుంది” అని విలన్ చెప్పగా.. “నాది కానీ రోజు కూడా.. నేను ఇలాగే నిలబడతా.. అర్ధమైయిందా” అని నరేష్ బదులివ్వడం నరేష్ పాత్ర ఉగ్రంలోఎంత ఫెరోషియస్ గా వుంటుందో తెలియజేస్తుంది. విలన్స్ తన  కుటుంబం జోలికి వచ్చినపుడు పోలీసుగా వున్న నరేష్ ఎలాంటి ఉగ్రరూపం చూపిస్తాడో అనేది క్యూరియాసిటీ పెంచేలా చూపించారు. అల్లరి నరేష్ పాత్రను విజయ్ కనకమేడల కొత్తగా, ఇంటెన్స్ గా డిజైన్ చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా  నరేష్ సరిగ్గా సరిపోవడమే కాకుండా  ప్రేక్షకులని ఎంగేజ్ చేసేలా ఆకట్టుకున్నారు. నరేష్ భార్య పాత్రలో  మిర్నా కనిపించింది.

తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. షైన్ స్క్రీన్స్‌ ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్‌గా ఉంది. ఈ ఇంటెన్స్ యాక్షన్‌కి సిద్ సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, శ్రీచరణ్ పాకాల తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదనపు బలాన్ని తెచ్చారు. ఛోటా కె ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.

 నాగచైతన్య మాట్లాడుతూ “ఉగ్రం టీజర్ చూసిన వెంటనే అదిరిపోయిందనిపించింది. నరేష్ గారిని చూసి స్టన్ అయిపోయాను. నాంది తర్వాత నరేష్ మళ్ళీ అలాంటి ఇంటెన్స్ రోల్ చేయడం చాలా ఆనందంగా వుంది. అల్లరితో మొదలుపెట్టి ఈ రోజు ఉగ్రంతో వస్తున్నారు. ఇదొక అద్భుతమైన ప్రయాణం. నరేష్ కి అభినందనలు. విజయ్ నరేష్ కాంబినేషన్ ఒక బ్రాండ్ లా పడిపోయింది. ఉగ్రం టీజర్ చూస్తే నెక్స్ట్ లెవల్ అనిపించింది. విజయ్ కి కూడా అభినందనలు. వీరి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలి. అన్ని డిపార్ట్ మెంట్ అద్భుతంగా పని చేశారు. సాహు హరీష్ వండర్ ఫుల్ ప్రోడ్యుసర్స్. మజిలీ నా కెరీర్ లో బెస్ట్ మూవీ. వాళ్ళు ఆ సినిమాని సపోర్ట్ చేసిన విధానం మర్చిపోలేను. ఉగ్రంలో కూడా ఆ క్యాలిటీ కనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి’’ అని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్