Sunday, January 19, 2025
HomeTrending Newsతిరుపతికి ఇద్దరు ఎమ్మెల్యేలు:  లోకేష్ ఎద్దేవా

తిరుపతికి ఇద్దరు ఎమ్మెల్యేలు:  లోకేష్ ఎద్దేవా

జగన్ కేబినెట్ లో  బూతుల మంత్రులు తప్ప సబ్జెక్ట్ ఉన్న వారు ఒక్కరు కూడా లేరని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.  యువ గళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో భవన నిర్మాణ కారికులతో లోకేష్ ముఖాముఖి మాట్లాడారు. ఈ  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దెబ్బ భవన నిర్మాణ కార్మికులపైనే పడిందని, ఇసుక కొరత కారణంగా నెలల తరబడి పనుల్లేక పస్తులున్నారని అన్నారు.  కార్మికుల సంక్షేమం కోసం తమ హయంలో ఎన్నో పథకాలు మొదలు పెట్టామని… చంద్రన్న బీమా తెచ్చామని, వారికోసం అన్నా క్యాంటిన్లు కూడా పెట్టామని తెలిపారు. అప్పట్లో చంద్రబాబు  మంత్రి నారాయణ ను వివిధ రాష్ట్రాలకు పంపి ఇలాంటి పథకానికి రూపకల్పన చేయించారని, ఈ  ప్రభుత్వం రాగానే  దాన్ని నిలిపివేసిందని అన్నారు. అలాంటి నారాయణను ఎలా వేదిస్తున్నారో చూడాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే  100 రోజుల్లోపు అన్నా క్యాంటిన్లు తెరిపిస్తామని హామీ ఇచ్చారు.

బాబు హయంలో తప్పు చేస్తే సిఐడి కాదని బాబుగారు మమ్మల్ని తన్ని ఉండేవారని వ్యాఖ్యానించారు.  సిబిఐ, ఐటి, ఈడీ అన్ని కలిపితే చంద్రబాబు అని, ఏదైనా తప్పు చేస్తే బాబు తమను రఫ్ ఆడించేవారని అన్నారు.  సిఎం జగన్ మద్యంపై వచ్చే డబ్బులు తాకట్టు పెట్టి 25వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని,   మద్యంపై రోజుకు 3 కోట్ల రూపాయల ముడుపులు రానిదే సిఎం నిద్రపోరని ధ్వజమెత్తారు.

తిరుపతిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని తండ్రి తానూ మద్యం తాగానంటారని, కొడుకు సిండికేట్ నడిపిస్తాడని.. తండ్రి గంజాయి తీసుకో వద్దంటారని, కొడుకు గంజాయి అమ్మిస్తాడని…. భూములు హాయిగా రిజిస్ట్రేషన్ చేసుకోమని తండ్రి చెబుతారని,కానీ రిజిస్ట్రేషన్ కాకుండా ఆపేది కొడుకని… భూమన కరుణాకర్ రెడ్డి. అభినయ్ రెడ్డిలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. నా తిరుపతి, నా తిరుపతి  అని భూమన చెబుతారని కానీ అసలు ఆయనది కడప జిల్లా అని ఎద్దేవా చేశారు.

Also Read : కుప్పంలో మూడ్రోజులపాటు యువ గళం యాత్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్