Monday, February 24, 2025
Homeసినిమా'కనెక్ట్' కోసం దిగొచ్చిన నయనతార! 

‘కనెక్ట్’ కోసం దిగొచ్చిన నయనతార! 

నయనతారకి తెలుగు .. తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన పనిలేదు. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన నాయికగా అలరిస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన కథలను ఎంచుకుంటూ వెళుతోంది. ఆమె గ్లామరస్ పాత్రలను పక్కన పెట్టేసి, నటన ప్రధానమైన పాత్రలను ఎంచుకోవడం మొదలుపెట్టి చాలాకాలమే అయింది. నాయిక ప్రధానమైన కథల్లో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్లను .. హారర్ థ్రిల్లర్లను ఎంచుకుంటూ వస్తోంది.

అలాంటి నయనతార ఈ సారి మరో హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఆ సినిమా పేరే ‘కనెక్ట్‘. తమ ఆత్మీయుల ఆత్మలతో ‘కనెక్ట్’ కావడం కోసం నాయిక చేసిన ప్రయోగంగా .. ప్రయత్నంగా ఈ కథ తెరపై కనిపిస్తుంది. ఇప్పటికే వదిలిన టీజర్ ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో నయనతార కనిపించడమే అసలు విషయం .. విశేషం.

సాధారణంగా నయనతార తన సినిమాల ప్రమోషన్స్ కి రాదు. ఒకటి రెండు సినిమాల ప్రమోషన్స్ లో తప్ప ఆమె అలాంటి ఈవెంట్స్ లో కనిపించిన దాఖలాలు లేవు. తాను ప్రమోషన్స్ కి రాను అనే అంశం కూడా అగ్రిమెంటులో ఉండేలా చూసుకుంటుందనే వార్తలు కూడా వినిపించాయి. సీనియర్ స్టార్ హీరోలు సైతం ఆమెను ప్రమోషన్స్ కి రప్పించలేకపోయారు. అలాంటి నయనతార ‘కనెక్ట్’ ప్రమోషన్స్ కోసం తెలుగు మీడియాలో హడావిడిగా కనిపిస్తోంది. అందుకు కారణం ఈ సినిమా ఆమె సొంత బ్యానర్లో నిర్మితం కావడమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్