Sunday, January 19, 2025
HomeTrending NewsCM YS Jagan : ఎమ్మెల్సీ ఫలితాలపై ఆందోళన వద్దు: సిఎం జగన్

CM YS Jagan : ఎమ్మెల్సీ ఫలితాలపై ఆందోళన వద్దు: సిఎం జగన్

ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి లబ్ధిదారుడినీ మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు సూచించారు.  ప్రభుత్వంపై విపక్షాలు, మీడియా చేస్తున్న అసత్య ప్రచారాన్ని సరిగా తిప్పికోట్టలేకపోతున్నామని సిఎం అభిప్రాయపడ్డారు.  తన తండ్రి వైఎస్ నుంచి  మానవ సంబంధాలను కొనసాగించడం నేర్చుకున్నానని, ఇక్కడున్న ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరినీ వదులుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. దాదాపు 60మందికి టిక్కెట్లు లేవంటూ వస్తున్న ప్రచారాన్ని సిఎం తోసిపుచ్చారు. ‘వచ్చే ఎన్నికల్లో మీ అందరినీ మరోసారి గెలిపించాలన్నదే నా తాపత్రయం ’ అంటూ భరోసా ఇచ్చారు.  గడప గడపకూ మన ప్రభుత్వాన్ని  మరింత పటిష్టంగా కొనసాగించాలని, ఆగస్టు దాకా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారు. గడప గడపకూ మనప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో వర్క్ షాప్ జరిగింది.  సిఎం జగన్ పలు అంశాలపై నేతలకు మార్గ నిర్దేశం చేశారు.

ఎన్నికలకు మరో 14నెలల సమయం ఉందని చెప్పిన జగన్ ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తెరదించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, వారిలో 80శాతం మంది  ప్రభుత్వం అందిస్తోన్న ప్రత్యక్ష నగదు బదిలీ పథకంలో లేనివారేనని, కేవలం 20 శాతం మందే వ్యతిరేకంగా ఓటేసిన వారున్నారని.. ఈ ఫలితాలు చూసి తెలుగుదేశం వాపును బలుపు అనుకుంటుందని ఎద్దేవా చేశారు.  ఇది రిప్రెజంటేటివ్ శాంపిల్ కాదని  చెప్పారు. దీనిపై ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను సిఎం ఎమ్మెల్యేలకు ప్రదర్శించారు.

Also Read : AP Cabinet: క్యాబినెట్ మార్పులు లేవు: పేర్ని నాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్