Saturday, January 18, 2025
HomeTrending Newsప్రజల్లో ఉండాల్సిందే: సిఎం జగన్ క్లాస్

ప్రజల్లో ఉండాల్సిందే: సిఎం జగన్ క్లాస్

మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండాల్సిందేనని, ఈ విషయంలో దొంగ దారులు వెతకొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు హెచ్చరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్‌ షాప్‌ జరిగింది.  మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే టిక్కెట్లు ప్రకటిస్తామని, పనితీరు ఆధారంగా మార్పులుంటాయని స్పష్టంగా చెప్పారు. పనితీరు మార్చుకోవాలని 27 మంది ఎమ్మెల్యేలకు పేర్లు ప్రస్తావించి మరీ క్లాస్ పీకారు. వీరిలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. నెలకు 16 రోజులు ప్రజల్లో ఉండాలని చెపినా వీరిలో కొందరు ఇప్పటికి మొత్తంగా కేవలం 16 రోజులు మాత్రమే తిరిగారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు గడప గడకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగితే దాన్ని పరిగణన లోకి తీసుకోబోమని చెప్పారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పని చేయాలని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దిశా నిర్దేశం చేశారు.

మంత్రులు, మాజీ మంత్రులు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని… వారి వారసులకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించేది లేదని జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకోవడం లేదని పేర్ని నాని  చెబుతూ తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరారు. దీనిపై జగన్ స్పందిస్తూ మళ్ళీ మీరే తనతో కలిసి పని చేయాలని పేర్ని, బుగ్గనలకు ఉద్దేశించి అన్నారు. మళ్ళీ డిసెంబర్ లో తాను సమీక్ష నిర్వహిస్తానని, అప్పటికి అందరూ పనితీరు మార్చుకోవాలని, మరోసారి పేర్లతో సహా చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా, విశ్వరూప్, ఆర్కే రోజా, కారుమూరు నాగేశ్వరరావు… మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని, మేకతోటి సుచరిత, … ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, గ్రంధి శ్రీనివాస్, అదీప్ రాజ్, చీర్ల  జగ్గిరెడ్డి, ధనలక్ష్మి, రఘురామిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మహీధర్ రెడ్డి, కొండేటి చిట్టిబాబు, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డిలు సిఎం చెప్పిన జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు.

Also Read : గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో 20వేల ఉద్యోగాలు: సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్