టాలీవుడ్ పొడగరి భామల జాబితాలో పాయల్ రాజ్ పుత్ ఒకరుగా కనిపిస్తుంది. హాట్ లుక్స్ తో కుర్రకారును ఆకట్టుకోవడం .. మత్తెక్కించే చూపులతో కట్టిపడేయడం పాయల్ కి బాగా తెలుసు. అందువలన ఆమె చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా, ఆ సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నా ఆమెకి ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. గ్లామర్ ఒలకబోసే విషయంలో తనకి పెద్దగా మొహమాటాలు లేవనే విషయాన్ని ‘RX 100’ సినిమాతోనే పాయల్ నిరూపించింది. ఆ సినిమాతోనే చాలామంది ఆమె అభిమానులుగా మారిపోయారు.
ఆ సినిమా నుంచి ఆ తరహా పాత్రలు పాయల్ కి చాలానే వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో ఆమె విజయాలను అందుకోలేకపోయింది. గ్లామర్ పరంగా మాత్రం తనకి రావలసిన మార్కులు తెచ్చేసుకుని, కెరియర్ ను నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ సినిమా చేసింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ మధ్య కాలంలో పాయల్ చేసిన పెద్ద సినిమాగా దీనిని గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోను ఆమె పాత్ర రొమాంటిక్ టచ్ తో ఉండటం విశేషం.
ఈ కథ గ్రామీణ నేపథ్యంలో .. సైకలాజికల్ థ్రిల్లర్ గా నడుస్తుంది. ప్రతి ‘మంగళవారం’ ఆ గ్రామంలో ఎవరో ఒకరు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. అందుకు కారణం ఏమిటనేది సస్పెన్స్. కామాన్ని అదుపు చేసుకోలేని పాత్రలో పాయల్ కనిపించనుంది. ఆ పాత్ర ద్వారా ఇచ్చే రొమాంటిక్ టచ్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత పాయల్ జోరు మరింత పెరగడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.