Saturday, January 18, 2025
HomeTrending Newsబలోచిస్తాన్ లో హెలికాప్టర్ ప్రమాదం..సైనికుల మృతి

బలోచిస్తాన్ లో హెలికాప్టర్ ప్రమాదం..సైనికుల మృతి

పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్‌లతో సహా ఆరుగురు సైనికులు ఈ రోజు మృతి చెందారు. హెలికాప్టర్‌లో ఇద్దరు మేజర్ ర్యాంక్ అధికారులు ఉన్నట్లు సమాచారం. గత అర్థరాత్రి బలూచిస్థాన్‌లోని ఖోస్ట్ సమీపంలో ఫ్లయింగ్ మిషన్ సమయంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను పాకిస్థాన్ ఆర్మీ ధృవీకరించంది. బెలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు ఉత్తరాన 150 కిలోమీటర్లు (90 మైళ్లు) దూరంలో ఉన్న హెర్నై జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని స్థానిక అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే బలోచ్ తిరుగుబాటుదారులు హెలికాప్టర్ పడగోట్టారా అనే అనుమానాలు పాక్ ఆర్మీలో ఉన్నాయి.

ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపం వల్లే కుప్ప కూలి ఉంటుందని పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన వాహనాలు, విమానాలు పాక్ సైన్యం వద్ద ఉన్నాయని, అవినీతి పాలకుల వల్లే నాసిరకమైన సౌకర్యాలతో సైనికుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని ఫవాద్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.

గత నెల ప్రారంభంలో ఇదే విధంగా పాకిస్తాన్ సైనిక హెలికాప్టర్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కూలిపోయింది. బలూచిస్తాన్‌లో లాస్‌బెలాలో వరద సహాయక చర్యల్లో ఉండగా సాంకేతిక లోపంతో ఈ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఒక టాప్ ఆర్మీ కమాండర్ కూడా ఉన్నారు. రెండు నెలలుగా పాకిస్థాన్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వరదల్లో 1600 మందికిపైగా మరణించారు. ప్రస్తుతం ఆ దేశం అపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. భారత్, బంగ్లాదేశ్ సాయం చేయడానికి ముందుకు వస్తే దానిని తిరస్కరించింది. మిగతా దేశాలు పాకిస్తాన్ ను అదుకునేందుకు ముందుకు రావట్లేదు. ఐఎంఎఫ్ కొంత మెుత్తంలో నిధులను విడుదల చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్