అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన రాష్ట్ర వ్యాప్త పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరింత సంనద్ధతతో యాత్ర చేపడతామన్నారు. జనసేన బలం రోజురోజుకూ ప్రజల్లో బలపడుతోందని, మండల, గ్రామ స్థాయిలో కూడా పార్టీకి ఆదరణ పెరుగుతోందని, కొంత కాలం పాటు వేచి చూసి… పార్టీ నిర్మాణం, కమిటీలు పూర్తి చేసి ఆ తర్వాత యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన లీగల్ సెల్ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఇటీవల తాము నిర్వహించిన సర్వేల్లో అధికార వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమని తేలిందని, ఆ పార్టీకి 45 నుంచి 67 స్థానాలకే పరిమితమవుతుందని పవన్ స్పష్టం చేశారు. జనసేన ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా ఉంది, ఏయే స్థానాల్లో ఇంకా బలం పెంపొందించుకోవాలనే దానిపై మరికొంత అధ్యయనం చేసిన తరువాత యాత్రకు తుది రూపం ఇవ్వాలని అనుకుంటున్నట్లు పవన్ చెప్పారు. పార్టీ సంనద్ధత, ప్రభుత్వ భవిష్యత్తుపై నేతలు, ఢిల్లీకి చెందిన నేతల నుంచి కొన్ని సూచనలు వచ్చాయన్నారు.
ఈలోగా జనసేన-జనవాణి, కౌలు రైతు భరోసా యాత్రలు కొనసాగుతాయని తెలిపారు. వచ్చే నల నుంచి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పై సమగ్ర సమీక్ష నిర్వహిస్తామన్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్రైలర్