Saturday, November 23, 2024
HomeTrending Newsఅటవీ భూముల అన్యాక్రాంతం అవాస్తవం: పెద్దిరెడ్డి

అటవీ భూముల అన్యాక్రాంతం అవాస్తవం: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో అటవీభూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న భూహక్కు-భూరక్ష సర్వే ద్వారా ప్రతి ఎకరంకు నిర్ధిష్టమైన సమాచారంతో యాజమాన్య హక్కులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని అన్నారు. రాష్ట్రంలోని అటవీప్రాంతాలకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో అటవీభూములను కబ్జా చేసి, తప్పుడు పట్టాలు సృష్టించి భూములను తమ ఆధీనంలో ఉంచుకున్నారనే ఫిర్యాదులపై ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోందని తెలిపారు. దాదాపు పదివేల ఎకరాలకు సంబంధించి ఈ వివాదాలు ఉన్నాయని, వాటిపై అటవీ, రెవెన్యూ అధికారుల సంయుక్త సర్వే జరుగుతోందని తెలిపారు.

దొంగపట్టాలతో ఎవరైనా అటవీభూములను తమ ఆధీనంలో పెట్టుకుని వాటిల్లో పంటలు పండించుకుంటున్నా వదిలిపెట్టేది లేదని, జాయింట్ సర్వేలో పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని హెచ్చరించారు.  రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర సర్వేలో సైతం శాటిలైట్ ఇమేజింగ్, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరైనా సరే సులువుగా అర్థం చేసుకునే విధంగా భూముల వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులను గుర్తించడం, ఆక్రమణకు గురైన భూములను తిరిగి అటవీశాఖకు బదలాయించడం జరుగుతుందని, ఇందులో ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

సీఎం జగన్  రాష్ట్రంలో అటవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అటవీశాఖ ఇచ్చిన ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూములు తప్ప, మిగిలిన అటవీ భూములు అక్రమంగా ఎవరి ఆదీనంలో ఉన్నా అవి తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

Also Read : ఆర్బీకేలపై విదేశాల ఆసక్తి: పెద్దిరెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్