Sunday, February 23, 2025
HomeTrending Newsరైల్వే జోన్ ఘనత మాదే: సోము

రైల్వే జోన్ ఘనత మాదే: సోము

Our Credit: రాష్ట్ర ప్రజల చిరకాలకోరిక విశాఖ రైల్వే జోన్ భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ పట్ల ప్రధాని మోడీ, కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రైల్వే ల అభివృద్ధి విషయమలో రాష్ట్ర ప్రభుత్వం తగిన స్పందన చూపడం లేదని, తన వాటా నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సోము విమర్శించారు.

రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయిందని నిన్న కేంద్రమంత్రి ప్రజటించడం పట్ల వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. కోనసీమరైల్వే లైన్, కడప-బెంగుళూరు రైల్వే లైన్లకు  రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా కోసం బిజెపి పెద్దఎత్తున ఉద్యమం చేస్తుందని వెల్లడించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తన పనితీరు మర్హుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్