Sunday, January 19, 2025
HomeTrending Newsబీజేపీ..TRSలది..జనతా బార్ పంచాయతీ - రేవంత్ రెడ్డి విమర్శ

బీజేపీ..TRSలది..జనతా బార్ పంచాయతీ – రేవంత్ రెడ్డి విమర్శ

జనతా బార్ లో ఒకటి వేసిన తర్వాత ఎవరు ఏం మాట్లాడతారో తెలియదని…రాష్ట్రంలో పంచాయతీ కూడా అట్లనే ఉందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ఏదైనా అనుమానం ఆడిగితే నివృత్రి చేయాలన్నారు. విశ్వవిద్యాలాయల నియామక బోర్డు వ్యవహారంలో ప్రభుత్వం – గవర్నర్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ పై రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో ఘాటుగా విమర్శలు చేశారు. గవర్నర్ అనుమానాలను తీర్చకుండా.. చిల్లర పంచాయతీకి ప్రభుత్వం తెర లేపుతుందని ఆరోపించారు. గవర్నర్ అనుమానం పై సమాధానం చెప్తే ఐపోయే అన్నారు.

గవర్నర్ కూడా ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొద్దని రేవంత్ రెడ్డి హితవు పలికారు. బీజేపీ నాయకుల బాధ్యత గవర్నర్ నిర్వహించాలని అనుకోవడం సమంజసం కాదన్నారు. బండి సంజయ్ పాత్ర పోషించాలని ఆనుకుంటున్నారు..మంచిది కాదని, ఫోన్ ట్యాపింగ్ బీజేపీ చేస్తోంది… Trs చేస్తోందన్నారు. బీజేపీ..trs ది మిత్ర భేదమని, బీజేపీ..trs ది… విక్రమార్కుడు సినిమాలో రవితేజ..బ్రహ్మానందం పాత్ర లెక్క ఉంటుందన్నారు. అందరికి గుండు కొట్టి పంపకాల పంచాయతీ పెట్టినట్టు…బీజేపీ..trs పంచాయతీ ఉందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఇచ్చింది ఎవరు…దీనిపై బీజేపీ.. trs లొల్లి ఏంది అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Also Read : అన్ని రాష్ట్రాల అభివృద్దే మోదీ లక్ష్యం – బండి సంజయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్