Sunday, January 19, 2025
Homeసినిమాపొన్నియిన్ సెల్వన్' ప్రీ రిలీజ్ హైలెట్స్ ఇవే!

పొన్నియిన్ సెల్వన్’ ప్రీ రిలీజ్ హైలెట్స్ ఇవే!

ఇప్పుడు అందరూ కూడా ‘పొన్నియిన్ సెల్వన్‘ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నారు. సౌత్ నుంచి ప్రపంచపటాన్ని  ఆక్రమించనున్న మరో సినిమా ఇది. మణిరత్నం కెరియర్లోనే భారీ బడ్జెట్ తోను .. భారీ తారాగణంతోను ఈ సినిమా రూపొందింది. అలాంటి ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై ఇటు త్రిష .. అటు ఐశ్వర్యరాయ్ అందంగా మెరిశారు. విక్రమ్ .. కార్తి .. జయం రవి వంటి సీనియర్ స్టార్స్  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విక్రమ్ మాట్లాడుతూ .. ” మణిరత్నం సార్ నా డ్రీమ్ డైరెక్టర్. ఆయనతో కలిసి మరోసారి పనిచేయడం నా అదృష్టం. ఇలా   ఇంతమంది హీరోలు  .. హీరోయిన్లు కలిసి ఒక సినిమాలో కనిపించడం ఈ మధ్య కాలంలో జరగలేదేమో” అన్నారు.  ఇక కార్తీ మాట్లాడుతూ .. “ఈ సినిమాను అందరూ ‘బాహుబలి’తో ఊహించుకుంటున్నారు. ‘బాహుబలి’ని ఆ ఆల్రెడీ మనం చూసేశాం .. ఇది చూడబోతున్న అద్భుతం. మణిరత్నంగారి 40 ఏళ్ల కల మరికొన్ని రోజుల్లో నెరవేరబోతోంది. ఎన్టీఆర్ గారిని గుర్తుచేసుకుని మరీ తెలుగు డైలాగ్స్ చెప్పాను” అంటూ సందడి చేశారు.

ఇక జయం రవి మాట్లాడుతూ ..” నేను ఐశ్వర్యారాయ్ గారి అభిమానిని. ఆమెను కలవాలనే నా కల నిజమైంది. ఆమెతో మాట్లాడే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూశాను. కానీ నా నటన చాలా బాగుందని ఆమెనే కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలి? ” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఐశ్వర్యారాయ్ మాట్లాడుతూ .. “మరోసారి మణిరత్నం గారి .. ఏఆర్ రెహ్మాన్ గారి  కాంబినేషన్లో చేసే ఛాన్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను గర్వంగా చెప్పుకునే సినిమా ఇది” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక సుహాసిని మాట్లాడుతూ .. “మణిరత్నంగారు మా పెళ్లికి ముందే వినిపించిన కథ ఇది. అది కార్య రూపాన్ని ధరించడానికి ఇంతకాలం పట్టింది. ఈ సినిమాను తమిళ నవలను ఆధారంగా చేసుకుని రూపొందించినదే అయినా, తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగు చేయడం జరిగింది. అందువలన ఇది తెలుగు సినిమానే. తెలుగు ప్రేక్షకులు ఆదరించవలసిన  సినిమానే. ఈ సినిమాలో అందరూ అద్భుతంగా చేశారు. రిలీజ్ తరువాత ప్రపంచమంతా ఐశ్వర్య రాయ్ గురించి చెప్పుకుంటుంది” అంటూ ముగించారు.

Also Read : అదే జరిగితే ..  టాలీవుడ్ లో త్రిష మళ్లీ బిజీనే! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్