Monday, January 20, 2025
HomeTrending Newsసైనిక శిక్షణ శిబిరం సందర్శించిన పుతిన్

సైనిక శిక్షణ శిబిరం సందర్శించిన పుతిన్

ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో సైనిక బలగాల ఆత్మస్థైర్యం పెంచేందుకు… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలు చేపట్టారు. రష్యాలోని ఓ ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక శిక్షణ శిబిరాన్ని వ్లాదిమిర్‌ పుతిన్‌ సందర్శించారు. అక్కడ శిక్షణ పొందుతున్న వారితో చాలా సేపు మాట్లాడారు. శిక్షణ గురించి ఉన్నతాధికారులతో వాకబు చేశారు. రైఫిల్‌ శిక్షణను పరిశీలించిన అనంతరం అక్కడ ఉన్న తుపాకీతో గురిపెట్టి లక్ష్యాన్ని కాల్చాడు. పుతిన్‌ వెంట రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉన్నట్లు క్రెమ్లిన్‌ తెలిపింది.

ప్రస్తుతం యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా ఉన్న సమయంలో పుతిన్‌ రియాజాన్‌లోని శిక్షణ కేంద్రాన్ని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. కళ్లద్దాలు, చెవులకు రక్షణనిచ్చే పరికరాలు ధరించి శిక్షణ కేంద్రంలో కలియదిరిగారు. నెట్‌లోపల స్నైపర్‌ రైఫిల్‌ను పేల్చారు. తర్వాత చిరునవ్వుతో బయటకు వస్తూ .. యుద్ధంలో దూసుకెళ్లాలన్నట్లుగా సూచించేలా సైనికుడి చేతిపై చరిచారు.

కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం కీలక దశలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంలో రష్యా అధ్యక్షుడు మార్షల్‌ లా ప్రయోగిస్తామని ప్రకటించారు. దాంతో ఉక్రెయిన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు నగరాల్లో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాస్కోకు ఆగ్నేయంలో ఉన్న రియాజాన్‌లోని సైనిక శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. రాబోయే రోజుల్లో పుతిన్ యుద్ద తంత్రం మరింత పదును చేసే అవకాశం ఉందని క్రెమ్లిన్ వర్గాల సమాచారం.

 

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్