యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతుండడం విశేషం. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘పీఆర్వోగా నాతో ఎన్నో సినిమాలు చేసిన వంశీ.. ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మారారు. ఆయనకు ఆల్ ది బెస్ట్. పీవీపీ సంస్థ ఎప్పుడూ మంచి చిత్రాలను నిర్మిస్తుంటుంది. అశ్వత్ గారి ఒరిజినల్ సినిమాను చూడలేదు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. మా వెంకటేష్ గారు చేసిన రోల్ చాలా ఇంపాక్ట్‌గా ఉంది. వెంకటేష్ అన్న కోసమైనా ఈ చిత్రం చూస్తాను. మిథిలా పాల్కర్‌కు నేను, నా భార్య అభిమానులం. ఆమె ఓటీటీ సూపర్ స్టార్. ఆశాకు ఆల్ ది బెస్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల్లీగల్లీలో విశ్వక్ సేనుడి గురించి తెలియని వారులేరు. ఆయనకు అంతటా అభిమానులున్నారు. యూత్, రెబల్, రేజింగ్ ఫ్యాన్స్ ఉంటారు కానీ.. ఆయన బయట ఉండే పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని.”
“ఇచ్చిన మాట కోసం నిలబడే వారంటే నాకు ఇష్టం. మంచో చెడో.. మాట ఇస్తే.. విశ్వక్ సేన్ నిలబడతాడు. నమ్మినదాని కోసం నిలబడం, పక్క వారి కోసం నిలబడటం పెద్ద అచ్చీవ్మెంట్. రజినీకాంత్, పవన్ కళ్యాణ్, చిరంజీవిల సినిమాలు హిట్ అవుతాయ్.. ఫ్లాప్ అవుతాయి. కానీ ఎల్లప్పుడూ సూపర్ స్టార్‌గా ఉండాలంటే.. పర్సనాలిటీ నిండుగా ఉంది. అలానే ఉండనివ్వు. ఈ చిత్రం అక్టోబర్ 21న రాబోతోంది. ఈ దీపావళికి ఈ సినిమా బాగుంటుందా? ఈ సినిమా వల్ల దీపావళి బాగుంటుందా? నాకు తెలియదు గానీ మీ అందరి ఆశీస్సులు వారికి ఉండాలి. నేను మాత్రం ఈ సినిమాను చూస్తాను. మంచి ఫీల్ ఉన్న చిత్రం. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. రాజమండ్రికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫంక్షన్ ఇక్కడ జరుగుతోంది. రంగస్థలం సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఉప్పెన ఫంక్షన్ పెట్టారు. అది వంద కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Also Read : ‘ఓరి దేవుడా’ నుంచి ‘గుండెల్లోన సాంగ్ రిలీజ్