Friday, November 22, 2024
HomeTrending Newsదిగివచ్చిన చైనా... కోవిడ్ నిబంధనల సడలింపు

దిగివచ్చిన చైనా… కోవిడ్ నిబంధనల సడలింపు

చైనాలో కోవిడ్ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కోవిడ్ నియ‌మావ‌ళిని స‌డ‌లించింది. త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవాల‌న్న నిబంధ‌న‌ను ఎత్తివేస్తున్న‌ట్లు తెలిపారు. బీజింగ్‌లోని జాతీయ ఆరోగ్య కేంద్రం ఇవాళ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసింది. వైర‌స్ సోకి ల‌క్ష‌ణాలు లేని వారు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్నారు. కాక‌పోతే వాళ్లు సాధార‌ణ ప‌రిస్థితుల్లో ఉండేందుకు వీలు క‌ల్పించారు. న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్ ప్ర‌క్రియ‌ను త‌గ్గించ‌నున్న‌ట్లు ఎన్‌హెచ్‌సీ తెలిపింది.

ఫలితంగా నెలల తరబడి ఇళ్లకే పరిమితమైన చైనీయులు.. కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా గ్వాంగ్జౌ నగరంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఎత్తేయడం సహా ఇండోర్ డైనింగ్ కు అనుమతిస్తుండడంతో రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. దీంతో రోడ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌, ప్రజా రవాణా వ్యవస్థలు ప్రజలతో సందడిగా మారాయి. ఆంక్షల సడలింపులను కొందరు చైనీయులు సమర్థిస్తుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు. వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనా జీరో కొవిడ్‌ విధానం ఓ దశంలో దేశంలో విప్లవ బీజాలు వేస్తోందా అనే అనుమానం పాలకులకు కలిగింది. సోషల్ మీడియాపై నిఘా పెట్టడంతో ప్రజలు డేటింగ్ యాప్ ల ద్వారా సమాచారం చేరవేసుకోవటం ప్రారంభించారు. ఈ విధంగా ప్రభుత్వం కన్నుగప్పి సమాచార వ్యాప్తి చేయటం పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారని నిఘా వర్ఘాలు చైనా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దీంతో కమ్యునిస్టు పాలకులు కోవిడ్ నిబంధనల సడలింపునకు దిగివచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్