Thursday, May 30, 2024
HomeTrending Newsఅక్రమాల అడ్డా ఎన్నారై అకాడమీ..ఈడి సోదాల్లో సంచలనాలు

అక్రమాల అడ్డా ఎన్నారై అకాడమీ..ఈడి సోదాల్లో సంచలనాలు

ఎన్నారై అకాడమీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రకటన విడుదల చేశారు. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లలో సోదాలు పూర్తి అయ్యాయని, ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. సొసైటీ సభ్యులు ఎన్నారై అకాడమీ నిధులతో సొంత భవనాలు నిర్మించుకున్నారనే అంశం తనిఖీల్లో బయటపడింది. కోవిడ్‌ సమయంలో భారీగా అక్రమాలు చేసి ఆర్థికంగా లబ్దిపొందారని, మెడికల్‌ సీట్ల కేటాయింపుల్లోనూ అక్రమాలు చేశారు. సొసైటీ అకౌంట్‌కు వచ్చిన నిధులన్నీ మరో అకౌంట్‌కు బదిలీ చేశారని, ఎన్‌ఆర్‌ఐఎస్ అనే అకౌంట్‌ తెరచి నిధులు మళ్లించారనే అంశం ఈడీ సోదాల్లో వెలుగు చూసింది. 53 ఆస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, రూ.కోట్ల నిధుల మల్లింపుపై ఆధారాలు లభ్యమయ్యాయని ఈడీ ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌ఐపై విచారణ కొనసాగుతోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్