Sunday, November 24, 2024
Homeసినిమాజపాన్ ఆర్ఆర్ఆర్ సంచలన రికార్డ్ ఇదే

జపాన్ ఆర్ఆర్ఆర్ సంచలన రికార్డ్ ఇదే

‘ఆర్ఆర్ఆర్’.. 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. సినిమా రిలీజై మార్చికి సంవత్సరం అవుతుంది.. అయినప్పటికీ ఇంకా వార్తల్లో ఉంటూనే ఉంది. రాజమౌళి నుంచి వస్తున్న సినిమా అంటే భారీగా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు అన్నింటిని ఆర్ఆర్ఆర్ అందుకుంది. అందుకనే మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం సక్సెస్ సాధించింది. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ గోల్డన్ గ్లోబ్ అవార్డ్ అందుకుంది. అలాగే ఈ సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కావడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇంతకీ విషయం ఏంటంటే.. జపాన్ లో మూడు నెలల క్రితం విడుదైన చిత్రానికి అనూహ్య స్పందన లభించింది. జపాన్ లో 42 కేంద్రాల్లో డైరెక్ట్ గా, షిఫ్ట్స్ పద్ధతిలో కలిపి 114 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఇన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో చరిత్ర సృష్టించింది. జపాన్ లో మూవీ శతదినోత్సవ మార్కు దాటిన విషయాన్ని దర్శకుడు రాజమౌళి ట్విటర్ ద్వారా తెలిజేశారు.

జపాన్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజుల్లో ఒక సినిమా 100 రోజులు, 175 రోజులు ఆడడం చాలా పెద్ద విషయం. కాలక్రమేణా వ్యాపార స్వరూపం మారిపోయింది. ఆ మధుర జ్ఞాపకాలు పోయాయి కానీ.. జపనీస్ అభిమానులు మాకు తిరిగి ఆ ఆనందాన్ని కలిగించారు. లవ్ యూ జపాన్ అని దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. జపాన్ లో 25 ఏళ్లు నుంచి ఉన్న రజనీకాంత్ ముత్తు రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ మూవీ క్రాస్ చేసింది. ఇప్పుడు 114 కేంద్రాల్లో 100 రోజులు ఆడి మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మరి.. ఆర్ఆర్ఆర్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read : ‘నాటు నాటు’ కు గోల్డెన్ గ్లోబ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్