రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా సైన్యాన్ని విమర్శించినా, తప్పుడు ప్రచారం చేసినా ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. సైన్యం ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడే వారు, వ్యవహరించే వారి పౌరసత్వాన్ని రద్దు చేసేలా అధికారులకు వీలు కల్పించనున్నారు. ఇందుకోసం అధ్యక్షుడు పుతిన్ రష్యా పార్లమెంట్ ఆమోదించిన ఓ చట్టానికి సవరణలను ప్రతిపాదించారు.
రష్యా సైన్యాన్ని విమర్శించేవారిని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిని నేరస్థులుగా పరిగణించి వారి రష్యన్ పాస్‌పోర్టులను, పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఈ సవరణల్లో పేర్కొన్నట్టు అధికార మీడియా వెల్లడించింది. రష్యాలో కొత్త భూభాగాల విలీనం ఫలితంగా పాస్‌పోర్టు ద్వారా రష్యా పౌరసత్వాన్ని పొందినవారిని ఈ చట్టం టార్గెట్ చేయనున్నది.