Sunday, September 29, 2024
Homeసినిమా'పుష్ప 2' ఆఫర్ కి నో చెప్పిన సమంత..?

‘పుష్ప 2’ ఆఫర్ కి నో చెప్పిన సమంత..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం పుష్ప చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ‘పుష్ప 2’ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల పుష్ప 2 చిత్రం సెట్స్ పైకి వచ్చింది. వైజాగ్ లో అల్లు అర్జున్ ఇంట్రో సాంగ్ చిత్రీకరించారు. ప్రస్తుతం రామెజీ ఫిలింసిటీలో అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పుష్ప సినిమా అనగానే.. ‘ఊ అంటావా మావ సాంగ్’ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సాంగ్ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ లోని సమంత హాట్ నెస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇంత వరకు ఎన్నడూ కనిపించని విధంగా చాలా హాట్ గా కనిపించింది. ప్రస్తుతం సమంత నటించిన ‘శాకుంతలం’ చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది. హిందీలో ఓ సినిమా చేస్తుంది. అలాగే హాలీవుడ్ మూవీ కూడా చేస్తుంది. మరి.. పుష్ప 2 లో సమంత నటిస్తుందా..? మరో ఐటం సాంగ్ చేయనుందా..? అంటే లేదని వార్తలు వస్తున్నాయి.

విషయం ఏంటంటే.. సుకుమార్ పుష్ప 2 లో కూడా మరో ఐటం సాంగ్ డిజైన్ చేశారట. ఈ సాంగ్ లో చేయమని సమంతను అడిగారట.  అయితే.. తను చేసిన ఐటం సాంగ్ అంటే ఊ అంటావా ఒక్కటే గుర్తుకురావాలని… మరో ఐటం సాంగ్ చేయకూడదు అని డిసైడ్ అయ్యిందట. అందుకనే సుకుమార్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సమంత ఇలా నో చెప్పడంతో.. సుకుమార్ ఈ ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ భామని రంగంలోకి దించాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఊర్వశీ రౌతేలా పేరుని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్