Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Malaysia Open : మలేషియా ఓపెన్ లో శుభారంభం

Malaysia Open : మలేషియా ఓపెన్ లో శుభారంభం

కౌలాలంపూర్ లో జరుగుతోన్న మలేషియా ఓపెన్ -2022లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు పివి సింధు, పారుపల్లి కాశ్యప్ రెండో రౌండ్ కు చేరుకున్నారు.

మహిళల సింగిల్స్ లో సింధు 21-13;21-17 తేడాతో పదో సీడ్ థాయ్ లాండ్ క్రీడాకారిణి చోచువాంగ్ పై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్ లో పారుపల్లి కాశ్యప్ 21-12;21-17 తో సౌత్ కొరియా ఆటగాడు హేయో క్వాంగ్ హీ పై గెలుపొందాడు.

మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్, మిక్స్డ్ డబుల్స్ లో సుమీత్ రెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ, మహిళల డబుల్స్ లో అశ్విని భట్- శిఖా గౌతమ్ జంట ఓటమి పాలయ్యారు.

రేపు మొదలయ్యే రెండో రౌండ్ ఫలితాల్లో పివి సింధు, ప్రణవ్, కాశ్యప్, పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ ప్రత్యర్ధులతో తలపడనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్