Sunday, January 19, 2025
HomeTrending Newsఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐకి : హైకోర్టు ఆదేశం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐకి : హైకోర్టు ఆదేశం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐతో విచారణ జరిపించాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సిబిఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే బిజెపి పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ ను మాత్రం హైకోర్టు కొట్టివేసింది, సాంకేతిక కారణాలతోనే బిజిపి పిటిషన్ ని ధర్మాసనం కొట్టివేసిందని ఆ పార్టీ నేత, సీనియర్ న్యాయవాది రామచందర్ రావు వెల్లడించారు. మరికొందరు పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న వాదనలను మాత్రం పరిగణనలోకి తీసుకుంది.

ఇరు పక్షాల నుంచి హోరాహోరీగా సాగిన వాదనలను పరిగణన లోకి తీసుకున్న ధర్మాసనం సిట్ దర్యాప్తును తోసిపుచ్చుతూ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది.

ఈ తీర్పు కేసిఆర్  ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. హైకోర్టు తీర్పుతో బంతి పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుంచీ ఈ కేసు విషయమై ప్రభుత్వం తప్పటడుగులు వేసిందని,  బలహీనమైన వాదనలతో రాజకీయంగా ఉపయోగించుకోవడానికే ఈ కేసును అధికార పార్టీ పెద్దలు వాడుకున్నారని విమర్శలు వినవస్తున్నాయి.

హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్