Saturday, February 22, 2025
HomeTrending Newsమా పొత్తు జనసేనతోనే: డా. లక్ష్మణ్

మా పొత్తు జనసేనతోనే: డా. లక్ష్మణ్

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి బిజెపి పోటీ చేస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్య సభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటూ వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనన్నారు.  ఏపీలో కూడా బిజెపి రోజురోజుకూ బలపడుతోందని, పవన్ తో కలిసి ఓ బలీయమైన శక్తిగా ఎదుగుతున్నామన్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను బిజెపికి అవకాశంగా మలచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కర్ణాటక తరువాత తెలంగాణాలో బిజెపి  బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు.

Also Read : బిజెపిలో ఉంటూ టిడిపి కోసం కోన రఘుపతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్