Sunday, January 19, 2025
HomeTrending NewsTPCC: కాంగ్రెస్ తొలి జాబితాలో బీసీలకు మొండి చేయి

TPCC: కాంగ్రెస్ తొలి జాబితాలో బీసీలకు మొండి చేయి

తెలంగాణ శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.ముందుగా ప్రకటించినట్టుగానే 55 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో సామాజిక సమీకరణల కూర్పులో కొత్తదనం ఏమీ లేదు. అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు దక్కాయి. గెలుపు గుర్రాలుగా భావిస్తున్న కొందరు నేతలు ఇటీవల చేరారు. కొత్తగా చేరిన వారికి 12 స్థానాలను కేటాయించింది.

ఓసీలకు 26 సీట్లు దక్కాయి. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి 17 సీట్లు వచ్చాయి. వెలమ వర్గానికి 7 సీట్లు, బ్రాహ్మణ వర్గానికి 2 సీట్లు దక్కాయి. మైనార్టీలకు 3 సీట్లు ఇవ్వగా… బీసీలకు 12 సీట్లు ఇచ్చారు. ఎస్సీలకు 12, ఎస్టీలకు 2 సీట్లు స్థానాలు ఖరారు చేశారు. తొలి జాబితాలో ఐదుగురు మహిళలకు టికెట్లు వచ్చాయి. తొలి జాబితాలో కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ పేరు ప్రకటించలేదు.

కాంగ్రెస్ తొలి జాబితా

  1. బెల్లంపల్లి – గడ్డం వినోద్
  2. మంచిర్యాల – ప్రేమ్ సాగర్
  3. నిర్మల్ – శ్రీహరి రావు
  4. ఆర్మూర్ – వినయ్ కుమార్ రెడ్డి
  5. బోధన్ – సుదర్శన్ రెడ్డి
  6. బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల
  7. జగిత్యాల – జీవన్‌రెడ్డి
  8. ధర్మపురి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  9. రామగుండం – రాజ్ ఠాకూర్
  10. మంథని – శ్రీధర్ బాబు
  11. పెద్దపల్లి – విజయ రమణారావు
  12. వేములవాడ – ఆది శ్రీనివాస్
  13. మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ
  14. మెదక్ – మైనంపల్లి రోహిత్
  15. ఆందోల్ – దామోదర రాజనర్సింహ్మ
  16. జహీరాబాద్ – ఏ చంద్రశేఖర్
  17. సంగారెడ్డి – జగ్గారెడ్డి
  18. మేడ్చల్ – తోటకూర వజ్రీస్ యాదవ్
  19. మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు
  20. గజ్వేల్ – నర్సారెడ్డి
  21. కుత్బుల్లాపూర్ – హన్మంత్ రెడ్డి
  22. ఉప్పల్ – పరమేశ్వర్ రెడ్డి
  23. చేవేళ్ల – భీమ్ భరత్
  24. పరిగి – రాంమోహన్ రెడ్డి
  25. వికారాబాద్ – గడ్డప్రసాద్
  26. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
  27. మలక్ పేట – షేక్ అక్బర్
  28. సనత్ నగర్ – నీలిమా
  29. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
  30. కార్వాన్ – మహ్మమద్ అల్ హజ్రీ
  31. గోషామహల్ – మోగిలి సునీత
  32. చంద్రాయణగుట్ట – బోయ నగేశ్
  33. యాకత్ పుర – రవి రాజు
  34. బహదూర్ పూర్ – రాజేశ్ కుమార్
  35. సికింద్రాబాద్ – సంతోష్ కుమార్
  36. కొడంగల్ – రేవంత్ రెడ్డి
  37. గద్వాల్ – సరితా తిరుపతయ్య
  38. అలంపూర్ – సంపత్ కుమార్
  39. నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
  40. అచ్చంపేట – వంశీకృష్ణ
  41. కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
  42. షాద్ నగర్ – శంకరయ్య
  43. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
  44. నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి
  45. హుజుర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
  46. కోదాడ – ఉత్తమ్ పద్మావతి రెడ్డి
  47. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  48. నకిరేకల్ – వేముల వీరేశం
  49. ఆలేరు – బీర్ల ఐలయ్య
  50. ఘన్ పూర్ – సింగాపురం ఇందిరా
  51. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
  52. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
  53. ములుగు – సీతక్క
  54. మధిర – భట్టి విక్రమార్క
  55. భద్రాచలం – పొదెం వీరయ్య

కాంగ్రెస్ తొలి జాబితాలో బీసీలకు మొండి చేయే మిగిలింది. మొదలి లిస్టులో మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ లకు చోటు దక్కలేదు. బీసీలకు దక్కిన 12 సీట్లలో నాలుగు యాదవులకే ఇచ్చారు. పాత బస్తీలో నాలుగు సీట్లు బీసీలకు ఇచ్చారు. వీటిల్లో గెలుపు సంగతి దేవుడెరుగు డిపాజిట్లు వస్తాయన్న నమ్మకం లేదు. దీంతో బలహీన వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది.

మొదటి జాబితాలో సీట్లు దక్కిన బీసీల్లో మూడు నాలుగు వీటిల్లో మాత్రమె గెలుపునకు అవకాశాలు ఉన్నాయి. మిగతావీ కేవలం బీసీలకు ఇచ్చామని చెప్పుకునేందుకే ఇచ్చారు.

బీఆర్ ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా… కాంగ్రెస్ ఈ రోజు తొలి జాబితా విడుదల చేసింది. రెండు పార్టీలు బీసీలకు అనుక్కున్నంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బిజెపిలో మేధోమధనం జరుగుతోంది. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఈ దఫా తెలంగాణలో బీసీలకు పెద్దపీట వేయనున్నారని… ఇందుకోసం కొందరు పార్టీ సీనియర్ ల సీట్లు కూడా గల్లంతు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ దఫా బిజెపి బలహీన వర్గాల్లో పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయి.

-దేశవేని భాస్కర్

Also Read: Ponnala: పొన్నాల కాంగ్రెస్ ను వీడితే ఎవరికి షాక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్