Sunday, January 19, 2025
Homeసినిమాటాలీవుడ్ సీనియర్ స్టార్స్ దృష్టి కూడా త్రిష పైనే!

టాలీవుడ్ సీనియర్ స్టార్స్ దృష్టి కూడా త్రిష పైనే!

త్రిష .. రెండే అక్షరాలు .. కానీ 20 ఏళ్లకి పైగా ఆమె తిరుగులేని కెరియర్ ను కొనసాసగిస్తూ వెళుతోంది. తెలుగు …. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేసిన త్రిష అడపా దడపా మాత్రమే మలయాళ .. కన్నడ సినిమాలు చేసింది. ఇక బాలీవుడ్ పై ఆమె పెద్దగా దృష్టి పెట్టలేదు. ‘నాయకి’ సినిమా తరువాత నుంచి తెలుగు తెరపై త్రిష కనిపించడం తగ్గుతూ వచ్చింది. ఆ తరువాత ఆమె పూర్తిగా తమిళ సినిమాల వైపే మొగ్గు చూపింది.

తమిళంలో నాయిక ప్రధానమైన పాత్రలను ఎక్కువగా చేస్తూ వెళుతూనే, అక్కడి సీనియర్ స్టార్ హీరోల జోడీగాను మెరవడం మొదలెట్టింది. అయితే ఇక్కడ శ్రియ .. అనుష్క .. కాజల్, అక్కడ నయనతార వంటి సీనియర్ స్టార్ హీరోయిన్స్ బరిలో ఉండటం వలన, అక్కడా ఇక్కడా కూడా వాళ్లతోనే చేయడానికి మేకర్స్ ఆసక్తిని చూపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే త్రిష ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేసింది. ఈ సినిమాలో త్రిష ‘కుందవై’ పాత్రలో మెరిసింది.

మునుపటికంటే అందంగా కనిపించిన త్రిషను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. తెరపై ఆమె ఐశ్వర్యరాయ్ ముందు తేలిపోకుండా నిలబడింది. సాధారణంగా అవకాశాలు పెద్దగా లేకపోతే ఎవరైనా ఫిట్ నెస్ పై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ త్రిష తన గ్లామర్ ను రెట్టింపు చేసుకుని షాక్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల నుంచి ఆమెకు అవకాశాలు వెళుతున్నట్టుగా సమాచారం. ఇక్కడ అనుష్క .. కాజల్ .. శ్రియ జోరు తగ్గడం కూడా అందుకు మరో కారణంగా చెప్పుకోవాలి. వన్నె తగ్గని కారణంగా త్రిష మళ్లీ విజయ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిందంటే, ఆమె ఏ రేంజ్ లో కసరత్తు చేసిందో అర్థం చేసుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్