Thursday, November 28, 2024
HomeTrending Newsతగిన గౌరవం ఇస్తే పొత్తుకు రెడీ: పవన్

తగిన గౌరవం ఇస్తే పొత్తుకు రెడీ: పవన్

‘నా కడ శ్వాస వరకూ రాజకీయాలను వదలను, మిమ్మలి వదలను’ అని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  ప్రకటించారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాదు కాబట్టే పొత్తులతోనే ఎన్నికల బరిలోకి దిగుతామని పరోక్షంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గౌరవం తగ్గకుండా, లొంగిపోకుండా ఉండేలా కుదిరితే పొత్తులతో వెళతామని, లేకపోతె ఒంటరిగానే వెళతామని తేల్చి చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలి లో నిర్వహించిన యువ శక్తి కార్యక్రమంలో పవన్ పాల్గొని ప్రసంగించారు. పొత్తులపై స్పందిస్తూ “మనకి గౌరవం ఉంటేనే ఏదైనా, గౌరవం లేకపోతే ఏ పొత్తు ఉండదు” అంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.  ఈ రోజు ప్రతి ఒక్కడితో మాట అనిపించుకుంటున్నా తనకు బాధ లేదని, ఇలాంటి మాటలు అనిపించుకోకుండా కూడా బతికేయగలనని…. కానీ ప్రజల పక్షాన నిలబడి తిట్టించుకోవడం విజయంగానే భావిస్తానని వ్యాఖ్యానించారు. డైమండ్ రాణి, సంబరాల రాంబాబుతో కూడా మాటలు పడుతున్నానని రోజా, రాంబాబు లను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. సిఎం జగన్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్ లపై ఈ సభలో పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రీ…. ఉమ్మడి రాష్ట్రంలో మీ నాన్ననే ఎదుర్కొన్నా, నువ్వెంత?” అంటూ జగన్ ను ఉద్దేశించి మండిపడ్డారు. సలహా ఇచ్చేవాడు సజ్జల అయితే మూడు ముక్కల ముఖ్యమంత్రికి అన్ని పనికిమాలిన ఆలోచనలే వస్తాయంటూ సజ్జలను ఉద్దేశించి విమర్శించారు. వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడాల్సి వస్తే తాను అందరికంటే మంచివాడినని, దేవుణ్ణి అంటూ పవన్ స్పష్టం చేశారు.

పవన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

కోట్లు టాక్సులు కట్టే నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను అని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టండి…

నాకు సినిమాలు తప్ప వేరే దారి లేదు, కాంట్రాక్టులు లేవు

డబ్బు అవసరం లేని సమయంలో రాజకీయాలు కూడా వదిలేస్తా

చాలా ఏళ్ళు ఆలోచించాకే రాజకీయాల్లోకి వచ్చా

మహా అయితే ప్రాణం పోతుంది, కానీ ఓ సత్యాన్ని బలంగా మాట్లాడినవాడిని అవుతాను

నేను సున్నితమైన వ్యక్తిని కాను, అన్నిటికీ తెగించిన వాడిని

చిన్నప్పుడే తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్ళాలనుకున్న వాడిని

ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడి బతకను

జనసేనకు అధికారం ఇస్తే ప్రజల జీవితాలు మారుస్తా

నాకు అధికారం కంటే ప్రజల బాగోగులు ముఖ్యం

నాకు పిరికితనం మహా చిరాకు… నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా?

కులాలమధ్య చిచ్చు పెట్టి గెలవడానికి నేను సిద్ధంగా లేను

తనకు కనీసం పది సీట్లు ఇచ్చి ఉంటే సభలో బలంగా పోరాడేవాడిని

ఇవ్వలేదు కాబట్టే ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నా- నాకు రెండూ ఒకటే

కానీ ఆడితే ఫలితాలు ఎక్కువగా ఉండేవి – ఫలితాలు ఇవ్వగలిగే అవకాశం నాకివ్వండి

ప్రజలు నిలబడితేనే మార్పు వస్తుంది

ప్రజలు అండగా నిలబడకపోతే ఏమీ చేయలేను

ఈసారి కూడా ప్రజలు మారకపోతే మరో ఐదేళ్ళు ఎగిరిపోతుంది

జనసేన అధికారంలోకి వస్తే జీడి పరిశ్రమకు అండగా ఉంటాను,

కొబ్బరి బోర్డ్ ఏర్పాటు చేస్తాము, మత్స్యకారులకు జేట్టిలు నిర్మిస్తాం

నేను మన మత్స్యకారుల కోసం జెట్టీలు నిర్మిస్తాం, వలసలు ఆపుతాం, ఇక్కడే ఉపాధి కల్పిస్తాం.

గత ఎన్నికల్లో 53 నియోజక వర్గాల్లో ఓట్లు చీలడం వల్లే వైసీపీ గెలిచింది

నేను బాబును కలిసినప్పుడు ఏవో బేరాలు కుదిరాయని మొరిగారు

ఆయనకు సంఘీభావం తెలిపేందుకే వెళ్లాను

ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ గురించి కూడా నేను-బాబు మాట్లాడుకున్నాం

వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకూడదు – వ్యూహంతో పలిచేయాలి

ఒంటరిగా పోటీ చేస్తే గెలిపిస్తానంటే ఒకే, కానీ ష్యూరిటీ ఇస్తారా

వారాహితో వస్తాం, ఎవడు ఆపుతాడో చూస్తాం…

Also Read : Pawan-Fire: నా యుద్ధం నేనే చేస్తా: పవన్ కళ్యాణ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్